స్థానిక ఎన్నికలు అధికార యంత్రాంగానికి టెన్షన్ పుట్టిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కారణం ఏమైనా.. ఇప్పటికి సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మినరసింహం… జీవీఎంసీ కమిషనర్ సృజన నెల రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. వారి స్థానంలో ప్రభుత్వం తాత్కలికంగా అయినా బాధ్యతలు అప్పగించింది. అధికారులు సెలవు పెట్టడం సహజమే కానీ.. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం.. ఉన్న సమయంలో.. అదీ కూడా.. వరుసగా అన్ని రకాల ఎన్నికలు ప్రభుత్వం పెట్టిన సమయంలో.. ఉన్నతాధికారులు లీవ్ పెట్టడం.. ఆశ్చర్యకరమే.
రాజధాని భూములను ఇళ్ల స్థలాల పంపిణీ మిషన్ను పెట్టుకున్న సమయంలో… కీలక అధికారి సెలవు పెట్టారు. రాజధాని భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం .. హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయడం లేదు. ఎలాంటి పనులు చేయించినా… అధికారుల దగ్గర నుంచి వసూలు చేస్తామని హైకోర్టు గతంలోనే చెప్పింది. ఇలాంటి సమయంలో సీఎంవో అదనపు కార్యదర్శి… ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ప్రవీణ్ ప్రకాష్ దగ్గరుండి భూముల్ని చదును చేయిస్తున్నారు. మార్కింగ్ చేయిస్తున్నాయి. వాటిని సెంటు చొప్పున.. మార్కింగ్ చేయించి… ఉగాది రోజున రిజిస్ట్రేషన్ చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై పన్నెండో తేదీన కోర్టులో విచారణ జరగనుంది. గతంలోనే… రాజధాని భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామన్న హెచ్చరికలు రావడంతో లక్ష్మినరసింహం లీవ్ పెట్టడం…ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
అలాగే విశాఖ కాబోయే రాజధానిగా విశాక వర్గాలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగావైసీపీ తీసుకుంది. విశాఖ పట్నం టౌన్లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ.. టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతో.. కమిషనర్… ఎన్నికల నిర్వహణ విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకనుకున్నారేమో కానీ.. కమిషనర్ సృజన కూడా నెల రోజుల పాటు సెలవు పెట్టారు. ఎన్నికలు.. ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిన తర్వాత వారు మళ్లీ విధుల్లో చేరనున్నారు.