హైదరాబాద్లో ఇప్పుడంతా హైరైజ్ కల్చర్. 30 నుంచి అరవై అంతస్తుల అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ అపార్టుమెంట్లలో ఐదో ఫ్లోర్ ఉంటే.. రేట్లు తగ్గిస్తారు. కానీ హైరై్ అపార్టుమెంట్లో మాత్రం ఎంత ఎక్కువ ఎత్తులో ఉండాలనుుంటే అంతగా రేట్లు పెంచుతారు. అంటే.. కింది ఫ్లోర్లలో మాత్రమే రేట్లు కాస్త రీజనబుల్ గా ఉంటాయి. పైకెళ్లేకొద్ది బిల్డర్లు రేట్లు పెంచుతూ పోతారు.
ఇప్పుడు చాలా మంది ఎత్తులో ఉండాలనుకుంటున్నారు. లిఫ్ట్ సమస్య రాదు. నీటి సమస్య రాదు. భద్రతకు కావాల్సింతన భరోసా. ఇరవై అంతస్తులపైన అయితే.. మార్నింగ్, ఈవినింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పొల్యూషన్ అంత పై వరకూ రాదు. అందుకే ఎక్కువ మంది ఇరవై అంతస్తుల పైన ఫ్లాట్ల గురించే వాకబు చేస్తున్నారు. కింది అంతస్తుల్లో గాలీ, వెలుతురు సమృద్దిగా వస్తుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి.
పై ఫ్లోర్స్ లో ఉంటే గాలి, వెలుతురు కావాల్సినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఉదయాలు.. ఆహ్లాదకమైన సాయంత్రాలను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. 20 అంతస్తులపైన సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తుల్లోకి దోమలు కూడా రావు. ఇక 30 అంతస్తుల పైనుంచి చూస్తే నగరం అంతా కనిపిస్తుంది. ముఖ్యంగా కంటికి పచ్చదనం కనిపిస్తుంది.
పై అంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని కొంత మంది భావన. ఇక భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురు కావు. పై అంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు సమాజంలో హోదా గా భావిస్తున్నారు. ఎన్ని అంతస్తులు ఉన్నా.. అత్యాధునిక లిఫ్టులు .. ఎక్కడికో వెళ్తున్నామన్న భావన కలగనీయడం లేదు. అందుకే బిల్డర్లు కింద ఫ్లాట్ల విషయంలో బేరాలాడుతున్నా.. పై ఫ్లోర్ల విషయంలో మాత్రం.., రేట్లను పెంచుతున్నారు. అంటే హైలో నివసించాలంటే.. కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే్.