బ్యాంకాక్ భూకంపం తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. స్క్రై స్క్రాపర్లను నిర్మిస్తున్న బిల్డర్లు, వాటిని కొనుగోలు చేసిన వారు.. కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ భూకంపాల జోన్లో లేదు కానీ వంద శాతం రాదు అని చెప్పడానికి లేదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో తక్కువ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. అందుకే భూకంపాల ప్రమాదాన్ని తోసిపుచ్చలేరు.
బ్యాంకాక్‌లో స్కై స్క్రాపర్లు వణికిపోయిన తీరు చూసి ఇక్కడ కూడా అలాంటి డిజైన్లు ఉన్నాయా అని ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. ఇటీవలి కాలంలో లగ్జరీగా నిర్మితమవుతున్న స్కై స్క్రాపర్ అపార్టుమెంట్లలో అత్యంత ఎత్తులో క్లబ్ హౌస్ లు, వాకింగ్ ట్రాకులు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మిస్తున్నారు. ఆయా కంపెనీలు అవే తమ గొప్ప ప్రత్యేక ఆకర్షణ అని చెబుతున్నాయి. కోకాపేటలో నిర్మిస్తున్న ప్రతి ఆపార్టుమెంట్ పైనా ఇలాంటి లగ్జరీ ఏర్పాట్లు ఉన్నాయి.
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్టులో మూడు టవర్స్ ఉంటే మూడు టవర్స్ ను కలిపేలా ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్.. ఇతర లగ్జరీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ డిజైన్ చేశారు. మూడు వేర్వేరు టవర్లు..పైన వాటిని కలుపుతూ ఈ నిర్మాణం ఉంటుంది. లగ్జరీ నిర్మాణాల విషయంలో పేరు తెచ్చుకున్న డీఎస్ఆర్ ప్రాజెక్టులన్నింటిలోనూ ఇలాంటి డిజైన్లు ఉన్నాయి. మై హోమ్ మధ్యతరగతి కోసం చాలా అపార్టుమెంట్లు నిర్మించింది. కానీ లగ్జరీ గా ఉండేందుకు మై హోమ్ 99 పేరుతో ఓ ఆపార్టుమెంట్ నిర్మిస్తున్నారు. దీని స్ట్రక్చరల్ ప్లాన్ లోని పైన స్విమ్మింగ్ పూల్ .. ఇతర నిర్మాణాలు ఉంటాయి.
ఇటీవల పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు.. టవర్లను విడిగా నిర్మించి.. వాటిని మధ్యలో లేదా..పైన అనుబంధానం చేసే ప్రణాళికలతో వస్తున్నాయి. ఆకాశంలో వాకింగ్ ట్రాక్ అనుభవం ఇస్తామని అంటున్నాయి.అయితే ఇది ఎంత ప్రమాదకరమో బ్యాంకాంక్ భూకంపం చెబుతోంది. ఎంత చిన్న స్థాయిలో భవనాలు కదిలినా ..స్ట్రక్చర్ దెబ్బతింటుంది. హైదరాబాద్ భూకంపాల జోన్ పరిధిలో లేదు సెస్మిక్ జోన్ 2 పరిధిలోకి వస్తుంది. చాన్సులు చాలా తక్కువ. ఒకే వచ్చినా తక్కువ తీవ్రత ఉంటుంది.కానీ ఇలాంటి స్ట్రక్చర్ల వల్ల ఆ తక్కువ తీవ్రత భూకంపం వల్ల కూడా నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.