చంద్రబాబుది అంతా చాలా స్ట్రిక్ట్ వ్యవహారం. నేనేం చేసినా అది వందశాతం కరెక్ట్. ఎవ్వరూ విమర్శించకూడదు, ప్రశ్నించకూడదు అని చాలా బలంగా కోరుకుంటాడు. అందుకోసం ఎంత కఠినంగా వ్యవహరించడానికి అయినా సిద్ధమే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు వ్యవహరించిన తీరు అదే. బాబు జమానాలోనే పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. అలాగే కమ్యూనిస్టులతో సహా ఎవ్వరినీ నోరెత్తకుండా చేయడానికి, ఉద్యమం, పోరాటం అన్న మాటే వినపడకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు చంద్రబాబు. చంద్రబాబు డిక్టేటర్షిప్ కూడా ఆయన ఓటమికి ఒక కారణమైంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలాగే 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ కూడా ‘నేను మారాను…’ అని చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాడు చంద్రబాబు. టీచర్ల విషయంలో కూడా నా వ్యవహారశైలిలో చాలా మార్పు వచ్చిందని నిన్న కూడా చంద్రబాబు చెప్పుకొన్నాడు. కానీ ప్రశ్నించేవాళ్ళ విషయంలో మాత్రం బాబు తీరు ఏమీ మారలేదు. అనంతపురం జిల్లాలో బాలయ్య పిఎ వ్యవహారశైలి పుణ్యమా అని ఆందోళనలు రేకెత్తాయి. మామూలుగా అయితే అది చాలా చిన్న విషయం. చంద్రబాబుకైతే ఒక్క నిమిషంలో సాల్వ్ చేయగలిగిన సమస్య. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ 144 సెక్షన్ పెట్టేశాడు. రాజకీయ ఆందోళన….అది కూడా టిడిపి నాయకుల వళ్ళ వచ్చిన ఆందోళనను హ్యాండిల్ చేయలేక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరినీ ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకూ న్యాయమో చంద్రబాబకే తెలియాలి. ఇక్కడనే కాదు. అమరావతి కోసం భూసేకరణ, పోలవరం వ్యవహారం, హోదా కోసం శాంతియుత పోరాటాలు……విషయం ఏదైనా కూడా వెంటనే 144 సెక్షన్ జపించేస్తున్నారు చంద్రబాబు. పోలీసుల పవర్‌ని ఉపయోగించుకుని ప్రశ్నించేవాళ్ళనందరినీ తొక్కెయ్యడం అనేది అధికారంలో ఉన్నప్పుడు మహా పసందుగా ఉంటుంది. కానీ అలా చేసిన వాళ్ళందరూ కూడా …. ఆ తర్వాత కాలంలో ప్రజలకు దూరమైన వాళ్ళే. చంద్రబాబుకి కూడా అది అనుభవమే. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు మరోసారి అదే పోలీసు రాజ్యాన్ని నమ్ముకుంటున్నాడు చంద్రబాబు. బాలయ్య పిఎ పుణ్యమా అని వచ్చిన ఈ 144 సెక్షన్ పరిస్థితులను మాత్రం టిడిపివాళ్ళతో సహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నది వాస్తవం. ఇలాంటి నిర్ణయాలే ముందు ముందు అసలుకే ముంపు తెస్తాయనడంలో సందేహం లేదు. వింటున్నారా బాబయ్యా……?