ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష తిరుపతి వేదికగా స్పష్టమయింది. రైతులు నిర్వహించిన మహోద్యమ సభకు అన్ని పార్టీల నేతలూ హాజరయ్యారు. అందరూ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాని నినదించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి అడ్డగోలుగా చేసిన మోసాన్ని అందరూ ప్రజల ముందు పెట్టారు. చివరికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్పారు. ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించలేదు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే తప్పుకోవాలని అందరూ ముక్త కంఠంతో జగన్‌కు సలహా ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ అమరావతి ఆకాంక్ష ప్రజల్లో ఉందని.. అమరావతి ప్రజారాజధానిగా స్పఅటం చేశారు. జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ తరపున హాజరైన కన్నా లక్ష్మినారాయణ హాజరై దోచుకునేందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారని విమర్శఇంచారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అందరూ నేతలు హాజరయ్యారు. అమరావతి రైతుల సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వంద మందికిపైగా పట్టేలాస్టేజ్‌ను రూపొందించారు. అయితే అన్ని పార్టీల నుంచి నేతలు తరలిరావడంతో స్టేజ్ కూడా కిక్కిరిసిపోయింది.
అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నెలన్నర పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదాయత్ర చేసి తమ సంకల్పాన్ని చాటారు. ఎన్ని విమర్శలు.. లాఠీచార్జ్‌లు.. నిర్బంధాలు ఎదురైనప్పటికీ సభకు భారీగా జన సమూహం తరలి రావడంతో రైతులు తమ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకేశామన్న సంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు అనుమతిలో నిర్వహించిన సభ కాబట్టి .. అనుమతించిన సమయం ఆరు గంటల కల్లా ప్రసంగాలు పూర్తి చేసి సభను ముగించారు.