సినిమా వాళ్లు తలచుకుంటే ఏమైనా చేసేస్తారు. ఓ మంచి ఆర్ట్ డైరెక్టర్ ఉంటే చాలు. ప్రపంచాన్నంత సెట్లోకి తీసుకొచ్చి పెడతారు. విశ్వక్ సేన్ సినిమాకి అదే చేశారు. ఈ లాక్ డౌన్కి ముందు విశ్వక్ సేన్ ఓ సినిమా మొదలెట్టాడు. అదే… `ప్రాజెక్ట్ గామి`. హిమాలయాల నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ఓ యాత్రికుడు చేసే సాహసాలే ఈ కథకు మూలం. క్రౌడ్ ఫండింగ్ పద్ధతి ద్వారా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల.. షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు హిమాలయాలకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే.. హైదరాబాద్ శివార్లో ఈ సినిమా కోసం ఓ సెట్ వేశారు. అక్కడే మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా కమర్షియాలిటీకి దూరంగా, ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఓరకంగా చెప్పాలంటే డాక్యుమెంటరీ టైపు సినిమా. అయితే… సరికొత్త విజువల్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఈ సినిమాలో కనిపించనున్నాయట. అవసరమైతే ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.