కేటీఆర్ మనవడు..కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు గచ్చి బౌలిలోని ఓ ప్రభుత్వ స్కూల్ కు దాదాపుగా రూ.కోటి పెట్టి మరమ్మతులు చేయించారు. ఆయన సొంత డబ్బులు కాదు. తాను చదువుకున్న స్కూల్ లో ఫండ్ రైజింగ్ చేశారు. తాను కొంత వేశారు. స్కూల్ పనులు చేయించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓపెన్ చేయించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా హిమాన్షు స్పీచ్ లో… ఆ స్కూల్ పరిస్థితి చూసి తనకు కన్నీళ్లొచ్చాయని చెప్పారు.దాన్ని ఇతర పార్టీల నేతలు ట్రోల్ చేయడం ప్రారంభించారు.
బంగారు తునక అయిన తెలంగాణలో పేద విద్యార్థులు చదువుకునే బళ్లు ఎలా ఉన్నాయో హిమాన్షు చెప్పాడని ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులు కూడా మిగతా చోట్ల ఉన్నట్లే ఉంటాయి. కొన్ని స్కూళ్లను కార్పొరేట్ ఐటీ సంస్థలు దత్తత తీసుకున్నట్లుగా ఉంటాయి కానీ..లోపల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఎప్పుడో చేసిన చిన్న చిన్న పనుల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాయి.
ఇతర బడుల గురించి పట్టించుకునేవారే ఉండరు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు దాటిపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా మెరుగుపడలేదు. దాన్నే హిమాన్షు బయట పెట్టినట్లయింది. ఇటీవల కేటీఆర్ కూడా ఓ స్కూల్ ను దత్తత తీసుకుని సొంత డబ్బు రూ. కోటి పెట్టి పునర్ నిర్మించారు. అందరూ.. ఇలా ముందుకు రావాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం చేయాల్సినవి చేయకుండా.. ఇలా విరాళాలిచ్చి బాగు చేయించాలని కోరడం.. సోషల్ మీడియాలో వ్య.తిరేక ప్రచారానికి కారణం అవుతోంది.