తాగేసి, బిల్లు డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది చంపేశారు!
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఢాబాలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని తాగి, తినివెళ్ళిపోతుండగా అడిగినందుకు కొందరు దుండగులు ఢాబా కార్మికుడిని కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. ఆ దుండగులు కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్ సోదరుడు వెంకటరమణ, అతని అనుచరులని తేలింది. వీరు మొత్తం ఐదుగురిపై కేసు నమోదయింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంకటరమణతో సహా మిగిలిన ముగ్గురు నిందితులకోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా ఛైర్మన్ వెంకటరమణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు. ఆయనపై కూడా అనేక అక్రమ మద్యం కేసులు ఉన్నాయి.