దగ్గుబాటి పురందేశ్వరి – వెంకటేశ్వరరావు కుమారుడు… హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరారు. తండ్రి దగ్గుబాటి స్వయంగా జగన్ వద్దకు తీసుకెళ్లి చర్చలు పూర్తి చేశారు. ఆయన పర్చూరు నుంచి పోటీకి రెడీ అయ్యారు. ఆ లక్ష్యంతోనే.. దగ్గుబాటి.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. అయితే కొత్తగా.. దగ్గుబాటి హితేష్ చెంచురామ్.. పోటీకి ఎలా అర్హుడన్న ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. ఆయనకు.. అమెరికా పౌరసత్వం ఉండటమే కారణం. ప్రస్తుతం హితేష్ చెంచురామ్.. భారత పౌరుడు కాదు. అమెరికన్. ఆయన అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి.. సిద్ధపడ్డారు. ఆ మేరకు అమెరికాకు ధరఖాస్తు పెట్టుకున్నారు. ఇంకా పరిశీలనలోనే ఉంది. వారు యాక్సెప్ట్ చేస్తే.. ఆమెరికన్ సిటిజన్ షిప్ వదులుకున్నట్లవుతుంది. మరి అంత మాత్రాన.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడేనా..? .. అంటే నిబంధన ప్రకారం అర్హుడు కాదు.
విదేశాల్లో ఉండి.. విదేశీ పౌరసత్వం తీసుకుని… మళ్లీ స్వదేశానికి వచ్చి… ఆ విదేశీ పౌరసత్వం వదులుకున్న వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం ఐదేళ్ల పాటు.. సమయం ఉండాలి. అంటే.. విదేశీ పౌరసత్వాన్ని వదులుకున్న ఐదేళ్లు స్వదేశంలో నివసించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత వస్తుంది. కానీ.. అధికార పార్టీ అండ ఉంటే.. ఏమైనా చేయవచ్చు. అంటే.. పోటీ చేయవచ్చు.. గెలిచిన తర్వాత పదవి కూడా అనుభవించవచ్చు. ఎవరైనా… ఆయనపై కోర్టుకెళ్తే.. వాయిదాల మీద వాయిదాలు కోరుతూ.. అధికార పార్టీ అండతో బండిలాగించేయవచ్చు. ప్రస్తుతం… తెలంగాణలోని వేములవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై.. ఆయన గెలిచినప్పటి నుంచి వివాదం ఉంది. ఆయన భారత పౌరుడు కానే కాదని.. కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పినా.. ఆయన బంధువులు, ఆయన పార్టీ బీజేపీకి దగ్గరగా ఉండటంతో.. ఆయనకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. గతంలో అనర్హతా వేటు వేస్తారని భయపడినప్పటికీ… మళ్లీ టిక్కెట్ ఇచ్చి మరీ గెలిపించారు టీఆర్ఎస్ అధినేత.
దేశంలో మరికొంత మంది ప్రజాప్రతినిధుల పౌరసత్వంపైనా వివాదాలున్నాయి. అయినప్పటికీ.. అవన్నీ.. వారి వారి రాజకీయ జీవితం ముగిసిపోయేవరకూ.. అలా సాగిపోతూ ఉంటాయి కానీ… ఆ దెబ్బకు… రాజకీయ జీవితం ముగిసిపోయే అవకాశం లేదు. హితేష్ చెంచురామ్ తల్లి.. పురందేశ్వరి బీజేపీలో కీలక నేత. ఆమె తన కుమారుడి కోసం.. ఆ మాత్రం సాయం చేయలేనంత పరిస్థితుల్లో మాత్రం ఉండరు. కాబట్టి.. హితేష్ చెంచురామ్.. భారతీయుడు కానప్పటికీ.. ఆయన ఎన్నికల్లో బేషుగ్గా పోటీ చేయవచ్చు.. గెలిస్తే… అమెరికన్ సిటిజీన్… ఏపీ ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకోవచ్చు. అదే భారత ప్రజాస్వామ్య గొప్పదనం… కావొచ్చు.