భయం.. ఓ చిన్న వైరస్ భయం. అతి ఎంత ప్రమాదకరమో ఎవరికీ తెలియదు. చైనాలో వచ్చిందని .. చైనాలో గత్తర లేచిందని ఇక్కడ చెప్పుకున్నారు. ఇక్కడ మూడు కేసులు పాజిటివ్ వచ్చాయని ప్రచారం జరిగింది. అంతే.. స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. మదుపర్ల సంపద పన్నెండు లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్ కు ఈ మండే భయంకర పీడకలగా మారింది.
చైనాలో హెచ్ఎంపీవీ అనే వైరస్‌తో ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ వైరస్ ఇప్పుడు ఇండియాలోకి సోకిందని ప్రచారం ప్రారంభమయింది. ఈ మూడు కేసులు కేంద్రం నిర్ధారించినవి కావు. ప్రైవేటు ల్యాబుల్లో ఫైనల్ చేసినవి. ఇప్పటివరకూ కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం ప్రకటించింది. కానీ భయందోళనలు లేకుండా స్పష్టత ఇవ్వడంలో మాత్రం ఫెయిలయ్యారు. ఫలితంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
స్టాక్ మార్కెట్ ఇవ్వాళ నష్టపోతే రేపు కోలుకుంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే… ఇవాళ మొత్తం స్టాక్స్ వాల్యూ కోల్పోయిన వాళ్లు రేపు మళ్లీ అంతే మొత్తం తెట్టుకుంటారని లేదు. ఓ చిన్న వైరస్ దెబ్బకు.. స్టాక్ మార్కెట్ ఇంతలా అతలాకుతలం కావడం మన మార్కెట్లకు ఉన్న బలహీనత అనుకోవచ్చేమో.