కరోనా కంటే డేంజర్ వైరస్ అంట అని ఇండియాలో అంతా కంగారు పడుతున్నారు. స్టాక్ మార్కెట్లను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వీళ్ల హడావుడి చూసి సామాన్య ప్రజలు కూడా ఏదో జరిగిపోతోందని భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. నిజానికి ఈ వైరస్ పుట్టిందని అందరూ చెబుతున్న చైనాలో అంతా నార్మల్ గా ఉంది. దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కొంత మంది తప్పుడు ప్రచారంతో.. చైనాలో ఉంటున్న ఇండియన్స్ చైతన్య పరిచేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
చైనాలో ఇదీ పరిస్థితి అంటూ అక్కడ ఉంటున్న ఇండియన్స్ చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు షేర్లు చేస్తున్నారు. చైనాలో అంతా నార్మల్ గా ఉంది. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. ఆస్పత్రులు కూడా కిక్కిరిసి లేవు. అసలు వైరస్ .. కరోనా .. లాక్ డౌన్.. ఎమర్జెన్సీ అనే మాటలు కూడా వినిపించడం లేదు. హెచ్ఎంపీవీ అనేది ఓ సీజనల్ గా వచ్చే జలుబు లాంటిదని చైనీయులకు ఓ క్లారిటీ ఉంది. అందుకే వారు మహా ఆయితే ఓ మాస్క్ తో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ.. కిందామీదా పడిపోవడం లేదు. తమ జీవితాలను తలకిందులు చేసుకోవడం లేదు.
చైనాలో అంతా నార్మల్ గానే ఉందని.. చైనాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారంతో ఇండియాలో గందరగోళం లేపవద్దని అక్కడి ఇండియన్లు ఈ వీడియోలను పంపుతున్నారు. ఒకరిద్దరు కాదు..త పదుల సంఖ్యలో ఇలాంటి వీడియోలు పంపుతూండటంతో.. జనాల్లో క్లారిటీ వస్తోంది. ఇక్కడి ప్రజలు కళ్ల ముందు కనిపించే నిజాల్ని కూడా నమ్మడం లేదు కానీ.. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ను మాత్రం నమ్ముతున్న పరిస్థితుల్ని ఆసరా చేసుకుని దేశంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా ఉన్నారు. అయితే.. చైనా నుంచి వస్తున్న వీడియోతో ఓ క్లారిటీ వస్తోంతి. ఆ వైరస్ అసలు సీరియస్ గా తీసుకోవాల్సినదేమీ కాదని చెబుతున్నారు.
వైరస్ భయాల వల్ల ఇప్పటికే ఇండియాకు లక్షల కోట్ల నష్టం జరిగింది. ఇంకా జరగకుండా ఉండాలంటే..ఆ వైరస్ ఓ జలుబు మాత్రమేనని గుర్తించి లైట్ తీసుకోవాలి. ఆ వైరస్ గురించి ప్రచారం చేయడం మానేయాలి.. చర్చించుకోవడం మానేయాలి. అప్పుడే అంతా సర్దుకుంటుంది.