బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మీద ప్రస్తుతం బాలీవుడ్ దర్శక నిర్మాతలు గుస్సుగా ఉన్నారని ముంబై మీడియా టాక్. అమ్మడికి రాక రాక ఒక్క హాలీవుడ్ సీరియల్ ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ ఆఫర్ వచ్చినప్పటి నుండి ప్రియాంకా ప్రవర్తనలో మార్పులు వచ్చాయట. అమ్మడు అసలు బాలీవుడ్ హీరోలను దర్శక నిర్మాతలను పట్టించుకోవడం పూర్తిగా మానేసిందట. హాలీవుడ్ ఆఫర్ రావడంతో కళ్ళు నెత్తికెక్కిన అమ్మడు తనను ఇంత స్టార్ హీరోయిన్ని చేసిన బాలీవుడ్ నే చిన్న చూపు చూస్తుందని అంటున్నారు.
హాలీవుడ్ చాన్స్ రాగానే అమ్మడు బాలీవుడ్ సినిమాల మీద తక్కువ ఫోకస్ పెడుతుందట. కేవలం తన వల్లనే ఆగిపోయిన బాలీవుడ్ సినిమాలను కూడా తను పట్టించుకుపోవడం బీ టౌన్ దర్శక నిర్మాతలకు అర్ధం కాని పరిస్థితి అయ్యింది. సంజయ్ లీలా భస్నాలీ భాజీరావ్ మస్తాని, షారుఖ్ తో చేసే డాన్ 3, అజయ్ దేవగన్ తో నటించే గంగాజల్-2 సినిమాలు కేవలం తన వల్లే ఆగిపోయాయట.
అమ్మడు కాస్త చొరవ చూపించి వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుందేమో అనుకుంటే అసలు ఆ సినిమాలతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తుందట ప్రియాంకా.. అయితే వ్యవహారం ఇలానే కొనసాగితే బాలీవుడ్లో ఆ మూడు సినిమాలే ప్రియాకకు చివరి సినిమాలని అంటున్నారు. మరి అమ్మడు ఎందుకు ఇలా తల పొగరుగా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకే తెలియాలి.