విష్ణు మదిలో ఎప్పటి నుంచో మెదులుతున్న ప్రాజెక్టు.. ‘కన్నప్ప’. తనికెళ్ల భరణి ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న స్క్రిప్టు ఇది. ఆయనే డైరెక్షన్ చేయాల్సింది. కానీ విష్ణు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. భరణి నుంచి స్క్రిప్టు కొనుక్కుని, దానికి తమవైన మార్పులు చేసుకొని దాన్నో అంతర్జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు విష్ణు. అందుకోసం కొంతమంది దర్శకుల్ని సంప్రదించాడు కూడా. ఓ దశలో కృష్ణవంశీ పేరు కూడా బలంగా వినిపించింది. అయితే… ఇప్పుడు మాత్రం ఈ సినిమా కోసం హాలీవుడ్ దర్శకుడ్ని దిగుమతి చేయాలన్న ఆలోచన కొచ్చాడు విష్ణు. ప్రస్తుతం ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరికీ.. ఈ తరహా ఫాంటసీ, పౌరాణిక చిత్రాల్ని తెరకెక్కించిన అనుభవం ఉందట. వాళ్లలో ఒకరిని ఖరారు చేయాల్సివుంది. ఈ యేడాదే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, దాదాపు ఈ సినిమా కోసం రూ.70 కోట్లు ఖర్చు చేయబోతున్నామని విష్ణు అంటున్నాడు. మరి ఆ దర్శకుడు ఎవర్నది విష్ణునే చెప్పాలి.