సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తప్పు చేశారు. ఈ విషయం నిర్దారణ అయింది. కానీ వారు ఎవరి కోసం తప్పు చేశారో అందరికీ తెలుసు. మరి వారు ఎలా చర్యలు తీసుకుంటారు ?. . కానీ రూల్స్ ప్రకారం వెళ్లకపోతే తాము కూడా తప్పు చేసినట్లు అవుతుందని అధికారులు వణికిపోతున్నారు. అందుకే చర్యలు తీసుకోవాలని ఒకరిపైన ఒకరికి సిఫారసులు పంపుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలన్న సిఫారసు సీఎస్ దగ్గరకు చేరింది.
సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు విచారణలో ఉన్న కేసు మీద దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారని ఇది నిబంధనలకు విరుద్ధమని.. వారు సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు వెళ్లింది. పరిశీలించిన గవర్నర్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖకు పంపారు. ఆ సిఫారసు వచ్చిన చాలా రోజులకు రాష్ట్రం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ స్పందించారు. ఇంకా ఆలస్యం చేస్తే తనపైనా చర్యలు తీసుకుంటారని అనుకున్నారేమో కానీ.. ఆయన వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ సీఎస్‌కు పంపారు. ఇప్పుడు ఆ ఫైల్ సీఎస్ దగ్గర ఉంది.
సీఎస్ నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా వారు అలా చేయలేరు. వారు చేసింది కూడా సీఎం, సీఎస్ కనుసన్నల్లోనే. అనే అనుమానాలున్నాయి. మొత్తంగా చేసిన కుట్రలకు తగ్గ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారిపై వారు చర్యలు తీసుకోలేరు కానీ.. ప్రభుత్వం మారగానే.. ఒక్కొక్కరికి సినిమా కనిపించడం ఖాయమని నిజాయితీగా పని చేసే అధికారుల నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి.