చాలా కాలంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదురు చూస్తున్నట్లుగా ఆర్బీఐ రెపో రేటును కాస్త తగ్గించింది. ఇప్పటి వరకూ 6.5 శాతం ఉన్న రెపో రేటు ఇక నుంచి 6.25 శాతంగా ఉండనుంది. దీని వల్ల బ్యాంకులు కూడా పావు శాతం వరకూ వడ్డీని ఖాతాదారులకు తగ్గించే అవకాశం ఉంది. ఇది స్వల్ప మొత్తమే అయినా తగ్గింపు అనేది కనిపించడం చాలా ఊరటనిస్తుంది. డిమాండ్ పెరగడానికి అవకాశం కల్పిస్తుంది.
ద్రవ్యోల్బణం భారీగా ఉందన్న కారణంగా గత మూడేళ్ల కాలంలో వడ్డీ రేట్లను .. ఆర్బీఐ భారీగా పెంచింది. రెపోరేటును ప్రతి త్రైమానికానికోసారి పెంచుకుటూ పోవడంతో హోమ్ లోన్లు కాస్త సూసైడ్ లోన్లుగా మారాయన్న ఆందోళన వ్యక్తమయింది. రెపోరేటును ఆరున్నరకు చేర్చిన తర్వాత అలాగే స్థిరంగా ఉంచారు. ఇటీవల పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపించడంతో తగ్గిస్తారని అనుకున్నారు. అయితే గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆ నిర్ణయాన్ని కొత్త గవర్నర్ కు వదిలేశారు. కొత్త గవర్నర్ మల్హోత్రా తొలి సారి ప్రకటించిన మానిటరీ పాలసీలో తగ్గింపు ఇచ్చారు.
ఈ తగ్గింపు వల్ల పాతిక లక్షల రుణ భారం ఉన్న వారికి నాలుగు వేల వరకూ వెసులుబాటు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు భారీగా ఉండటం వల్ల చాలా మంది ఇళ్ల కొనుగోలుపై వెనుకడుగు వేస్తున్నారు. ఇక ముందు కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న నమ్మకం పెరుగుతుది.దీంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుదలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.