నైస్ గా ఉన్న అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగిందంటే మన అందం అలాంటిది మరి అనుకుని లిఫ్ట్ ఇచ్చేసి సర్వం పోగొట్టుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని బయటకు చెప్పుకోలేని విధంగా బుక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోంది జాయ్ అనే మహిళ. ఈమె దెబ్బకు విశాఖలో చాలా మంది ఒంటి మీద బట్టలు కోల్పోయారు. చివరికి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తనను ఓ మహిళ మోసం చేసి న్యూడ్ గా ఉన్న వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తోందని విశాఖకు చెందిన ఓ వ్యాపార ప్రముఖులు పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఆ వ్యాపార ప్రముఖుడు నిజం చెప్పారు. అదేమిటంటే… జాయ్ అనే మహిళ తన అందచందాలతో వల వేసిందని నమ్మేసి హోటల్ రూమ్‌కు వెళ్తే స్పృహతప్పేలా చేసి న్యూడ్‌గా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తోందని బావురుమన్నాడు. అయితే పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కానీ తర్వాత మరో ఇద్దరు, ముగ్గురు అలాంటి ఫిర్యాదులతోనే రావడంతో విశాఖ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
జాయ్ అనే మహిళ గురించి మొత్తం ఆరా తీశారు. కాస్త కంటికి అనువుగా ఉండే పర్సనాలిటీతో సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఆ మహిళ చాలా ప్లాన్డ్ గా ధనవంతులకు వల వేస్తున్నట్లుగా గుర్తు చేస్తున్నారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారు, ధనవంతులను లక్ష్యంగా చేసుకొని లోంగదిసుకొని హనీ ట్రాప్ కు పాల్పడేందుకు ప్రత్యేకంగా ముఠాను ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు. రూంకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్నట్టు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేయడం ప్రారంభించేది జాయ్.
బాధితులు చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారని … రహస్యంగా ఉంచుతామని వచ్చి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు పోలీసులు. జాయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆమె ముఠా కోసం గాలిస్తున్నారు.