డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ వంటి సూపర్ హిట్ ప్రేమకథలను డైరెక్ట్ చేసిన తేజ చిత్రాన్ని మరో సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 11న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబడుతూ విజయవంతంగా సాగుతుంది. అయితే సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఆర్ట్ సినిమాలా అనిపిస్తుందని కొందరు అభిమానులు, ప్రేక్షకులు తెలియజేయడంతో ఇప్పడు చిత్రాన్ని 15 నిమిషాల పాటు ట్రిమ్ చేసి కథలో వేగాన్ని పెంచారు. ఇప్పుడు సినిమా ఫుల్ స్పీడ్ తో కమర్షియల్ పంథాలో ఉంటుందని చిత్రయూనిట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రం ట్రిమ్ వెర్షన్ ఈరోజు నుండే అన్నీ థియేటర్స్ లో ప్రదర్శితమవుతుందని కూడా తెలియజేశారు.