ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరు పెట్టాలనుకున్నారు. ఆ తరవాత ‘రాధే శ్యామ్’ అనే పేరు బయటకు వచ్చింది. ‘ఓ డియర్’ మరో ఆప్షన్. ఉగాదికి ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ బయటకు వస్తుందనుకున్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఆ సందడి వాయిదా పడింది.
ఇటలీ నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమా మొత్తం అక్కడే జరగాలి. దాదాపు 30 శాతం షూటింగ్ అక్కడే జరిగింది. ఇండోర్ సన్నివేశాల్ని ఇక్కడ తీశారు. ఇప్పుడు కనోరా ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన సినిమా కూడా ఇక్కడే పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకోసం ఇప్పుడు హైదరాబాద్ లో ఆసుపత్రి సెట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఆసుపత్రి నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాల్సివుంది. దాన్ని ఇటలీలోనే తీయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాల్ని హైదరాబాద్ లో సెట్లు వేసి లాగించేయబోతున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం రెండు మూడు పెద్ద సెట్లు తీర్చిదిద్దారు. వాటి పక్కనే ఆసుపత్రి సెట్నీ వేయబోతున్నారు.