తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ లేరు. కానీ ఆ లోపం కనిపింంచడం లేదు. చర్చలు జోరుగా సాగుతున్నాయి. సవాళ్లు చేసుకుంటున్నారు. నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యంలో అసలైన బ్యూటీని చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై మాత్రమే కాదు.. సభ జరిగిన ప్రతి రోజూ వార్ నడుస్తోంది. అధికార విపక్షాలు.. బూతుల దాకా వెళ్లకుండా.. టాపిక్ డైవర్ట్ చేయకుండా సబ్జెక్ట్ పైనే మాట్లాడుకుంటున్నారు.
అధికారపక్షం కూడా.. విపక్షం వాయిస్ ను అణిచి వేయాలని ప్రయత్నించడం లేదు. ప్రతీ సారి వారి వాదనకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఏపీలో జగన్ అసెంబ్లీకి రాలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలనూ పోనివ్వలేదు. అసలు తనకో హోదా ఉంటేనే అసెంబ్లీ లేకపోతే లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి ఏమైనా మాట్లాడే చాన్సిచ్చారా అంటే అసెంబ్లీకి వచ్చిన వారిపై బూతులతో దాడి చేసి ఏడిపించేవాళ్లు. సభలో ఉన్నారన్న సంగతిని కూడా తెలియకుండా కెమెరాను అటు వైపు చూపించేవారే కాదు.
సభలో ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఖచ్చితంగా సభలో వాయిస్ వినిపిస్తేనే అది లెక్కలోకి వస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకునేది దందాలు చేయమని కాదు.. అసెంబ్లీకి హాజరై ప్రజల గురించి మాట్లాడమే. కానీ వైసీపీ నేతలు దాన్ని మాత్రం వదిలేసి మిగతా పనులు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉండేది.. ఇప్పుడు పరిస్థితి మారింది.