సికింద్రాబాద్ వైపు బాగా అభివృద్ధి చెందుతున్న రియల్ మార్కెట్లలో ఒకటి మచ్చబొల్లారం. కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. బడా కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేందుకు స్థలాలను కూడా కొనుగోలు చేశాయి. పనులు ప్రారంభిస్తున్నాయి.
మచ్చబొల్లారం రెసిడెన్షియల్ , కమర్షియల్ ప్రాజెక్టులకు ఆకర్షణీయంగా మారింది. మచ్చబొల్లారం ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంగానే ఉంటుంది. ORR నుంచి వేగంగా ఐటీ కారిడార్ చేరుకోవచ్చు. సమీపంలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, బొల్లారంలో చిన్న తరహా పరిశ్రమలు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. రాను రాను నివాస గృహాలు పెరుగుతున్నాయి. ఇక్కడ దీర్ఘ కాల పెట్టుబడి కోసం చూసేవారు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు.
ఈ. ఏరియాలో ఇళ్లు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. నలభై లక్షల నుంచి డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ల ులభిస్తున్నాయి. త్రిబుల్ బెడ్ రూం అరవై లక్షలకు లభిస్తోంది. కాస్త దూరమైనా పర్వాలేదు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకునేవారికి ఇప్పుడు మచ్చబొల్లారం మంచి ఆప్షన్ ఇక్కడ200 గజాల స్థలంలో ఇల్లు 70 లక్షలకు లభిస్తోంది. కాస్త ఎక్కువ సౌకర్యాలు, గేటెడ్ కమ్యూనిటిలో అయితే కోటి వరకూ ఉంటోంది. ఇంటి స్థలాల వెంచర్లకూ మంచి ఆదరణ ఉంది.
హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పోలిస్తే, మచ్చబొల్లారం మధ్యతరగతి కుటుంబాలకు ఆకర్షణీయంగా ఉందని అనుకోవచ్చు. గత రెండేళ్లలో ధరలు సంవత్సరానికి 8-12 శాతం పెరిగాయి. రానున్నరోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డిమాండ్ పెరగడంతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకుంది.