డబ్బులు రెట్టింపు చేసుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తే. రియల్ ఎస్టేట్ లోనే అలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ స్లంప్ లో ఉంది. అంత మాత్రాన ఎప్పుడూ అలాగే ఉంటుందని కాదు. స్లంప్ లో ఉన్నప్పుడు కొంటేనే హైప్ వచ్చినప్పుడు విపరీతంగా లాభాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల తర్వాత పరిస్థితుల్ని విశ్లేషించుకుంటే రెండు ప్రాంతాల్లో ధరలు రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అమరావతి, రెండు విశాఖ.
సీఆర్డీఏ భేటీలో రూ.24,276 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో మొత్తంగా రూ.45,249 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ నిర్మాణాలు, రాజధాని లే ఔట్లు, ట్రంక్ రోడ్లు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి, చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు సుమారు 50,000 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలో చదరపు గజం రూ. 15,000 వరకూ ఉండేది. ఇటీవల చదరపు గజం రూ. 25,000 ధరకు చేరింది. అమరావతి పనులు, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు ఊపందుకుంటే ఏడాదిన్నర, రెండేళ్లలో రెట్టింపు అవుతాయని రియల్ ఎస్టేట్ వర్గాు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
ఇక విశాఖపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సాఫ్ట్ వేర్ హబ్ గా మార్చాలనుకుంటోంది. ఓ వైపు బోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. మరో వైపు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. విశాఖ ట్రూ గ్లోబల్ సిటీగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విశాఖ చుట్టుపక్కల ఎక్కడ స్థలాలు కొన్నా.. వాటి ధరలు ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో రెట్టింపు అవడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రాల్లోని మెట్రో సిటీస్లలో ఇళ్ల ధరలు అందనంతకు చేరుకున్నాయి. వాటి పెరుగుదల అమరావతి, విశాఖల స్థాయిలో ఉండదని భావిస్తున్నారు.