ఇప్పుడు ఎవరైనా ఇళ్లు కొనాలన్నా.. స్థలాలు కొనాలన్నా సిటీలో ఎవరూ చూడటం లేదు. శివారులోనే చూస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని వారు ఈ చాయిస్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాంతం ఘట్ కేసర్. ఒకప్పుడు సిటీకి దూరంగా.. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం ఇప్పుడు నివాసాలకు, భారీ అపార్టుమెంట్లకు కేంద్రంగా మారుతోంది. రవాణా సౌకర్యం కూడా భారీగా మెరుగుపడింది.
సమీపంలో విద్యాసంస్థలు భారీగా పెరిగాయి. ఐటీ పార్క్ కూడా దగ్గరగా ఏర్పడటంతో చాలా మంది పెట్టుబడి కోసమైనా ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఘట్ కేసర్లో మధ్యతరగతి వర్గాలకు అందాబుటులో ఇళ్లు ఉన్నాయి. అపార్ట్ మెంట్లలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 40 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. అదే ట్రిపుల్ బెడ్ రూం 55 లక్షలకు లభిస్తోంది. ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగు 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలు ఉంది.
హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో పిల్ల డిమాండ్ పెరుగుతోంది. ప్రాంతాన్ని, ప్రాజెక్టును, సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఇళ్ల ధరలు మారిపోతుంటాయి. నిర్మాణ సంబందిత ముడి సరకుల ధరలకు అనుగుణంగా వచ్చే ఆరు నెల్లలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంటుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. ఘట్ కేసర్ వైపు ఇళ్లు కొనాలనుకున్న వారు ఓ సారి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే ఓ క్లారిటీ వస్తుంది.