ఆదిభట్ల ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతున్న రియల్ ఎస్టేట్ గ్రోత్ సెంటర్లలో ఒకటి. ఓఆర్ఆర్కు పక్కనే ఉండటమే కాదు. ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఉంది. రంగారెడ్డి జిల్లా కార్యాలయం కూడా సమీపంలోనే నిర్మించారు. ఓ పదేళ్ల కిందటి వరకూ అక్కడ స్థలాలను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పూర్తి స్థాయి నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇళ్లు, కాలనీల నిర్మాణం అధికంగా ఉండటంతో సహజంగానే కమర్షియల్ గానూ వృద్ధి చూపిస్తోంది.
రంగారెడ్డి కలెక్టర్ నుంచి ఆదిభట్ల వరకూ ఇప్పుడు కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. అపార్టుమెంట్లు వద్దు .. చిన్నది అయినా ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునేవారికి ఆదిభట్ల మంచి ప్రాంతం. ప్రస్తుతం ఏరియాను బట్టి గజం 30 నుంచి 50 వేల రూపాయల వరకూ లభిస్తోంది. పలు చిన్నా, పెద్ద కన స్ట్రక్షన్ కంపెనీలు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హోమ్స్, విల్లాల నిర్మాణం చేపట్టాయి. సుమారు 15 వరకు నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
అపార్టుమెంట్లు సౌకర్యాలను బట్టి రూ. 50 లక్షలకు కూడా లభిస్తున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ 80 లక్షలు, విల్లా అయితే కోటిన్నర వరకూ చెబుతున్నారు. భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింతగా పెరగుతాయని లఅంచనా ఉండటంతో అక్కడ పెద్ద ఎత్తున కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదిభట్లలో టీసీఎస్ భారీ ఆఫీస్ ఉంది. ఇంకా పలు కంపెనీలు ఉన్నాయి. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటంతో మరింతగా పారిశ్రామికాభివృద్ధి జరగనుంది. అందుకే భవిష్యత్ లో ఆదిభట్లలో ఆస్తులు ఉన్న వారు మంచి రిటర్న్స్ పొందుతారని అనుకోవచ్చు.