హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా గాడినా పడుతోంది. ఇళ్లు కొనాలని నిర్ణయించుకుని ఆగిపోయినవారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తాజాగా ఏడు శాతం రిజిస్ట్రేషన్లు పెరిగినట్లుగా ఓ ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది.
రెండునెలలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో స్లంప్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ మాంద్యంతో పాటు కొత్త ప్రభుత్వం ప్రజలకు ఆస్తుల విషయంలో చిక్కులు రాకుండా ఉండేందుకు చేపట్టిన కొన్ని చర్యలు నెగెటివ్ ప్రచారానికి కారణం అయ్యాయి. హైడ్రా అన్ని అనుమతులు ఉన్న ఒక్క భవనాన్ని కూల్చకపోయినా ప్రచారం మాత్రం బీభత్సంగా జరిగింది. ప్రతి హౌసింగ్ ప్రాజెక్టుకు ఏదో లోపం ఉంటుందని.. దేనికీ గ్యారంటీ లేదన్న ప్రచారం చేశారు. చివరికి వారి లక్ష్యం మేరకు రియల్ ఎస్టేట్‌కు దెబ్బపడింది. అదే ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇప్పుడిప్పుడే వినియోగదారులు మళ్లీ మేలుకుంటున్నారు. మళ్లీ భారీగా పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిదని నిర్ణయించుకుంటున్నారు. అన్ని అనుమతులు ఉన్న వాటి జోలికి వచ్చే ప్రశ్నే లేదని ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. ఈ నమ్మకాన్ని కల్పించేందుకు హైడ్రాకు ప్రస్తుతం విశ్రాంతి కల్పించారు. హైడ్రా విషయంలో కూల్చివేతలు ఉంటే.. దానికి ఓ ప్రొసీజర్ ను పెట్టే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసమే హైడ్రా అని.. పర్మిషన్లు.. ఇతర అంశాలతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇది ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.
రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాలని మధ్యతరగతి వారుకూడా అనుకోలేరు. అందుబాటులో ఇళ్లు ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు వారు కొంతబేరం ఆడి ఇళ్లు కొనే అవకాశం రావడంతో ముందడుగు వేస్తున్నారు.