న్యాయమూర్తిగా పని చేసి రిటైరై.. ఏపీ ఎస్ఈసీగా చెల్లని పదవి చేపట్టిన జస్టిస్ కనగరాజ్ వ్యవహారం రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఆయనకు.. నాలుగు నెలల పాటు జీత భత్యాలు చెల్లించారు. అందులో జీతమే కాదు.. హౌస్‌రెంట్ అలవెన్స్ కూడా ఉంది. అయితే.. ఆయన ఆ అలవెన్స్ తీసుకున్నారు కానీ.. విజయవాడలో తాను తీసుకున్న ఫ్లాట్‌కు మాత్రం రెంట్ చెల్లించలేదు. లగ్జరీ అపార్టుమెంట్‌ను రెంట్‌కు తీసుకున్న కనగరాజ్ అందులో… ఎన్నికల కమిషన్‌కు చెందిన ఫర్నీచర్‌ను తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పదవి రద్దు అయింది. దాంతో ఆ ఫర్నీచర్‌ను తీసుకెళ్లడానికి ఎన్నికల కమిషన్ అధికారులు వెళ్లారు. అక్కడే వివాదం ఏర్పడింది. రెంట్ కట్టాల్సిందేనని యజమాని డిమాండ్ చేశారు.
Read Also : పాపం కనగరాజ్..! పదవి దక్కలేదు కానీ లక్షల బిల్లొచ్చింది..!
ఈ వివాదంపై ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలు చెప్పింది. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ నియామకం చెపట్టిన నాటి నుండి ఆయనకు జీతభత్యాలు .. ఇచ్చారు. అందులో హౌస్ రెంట్ కూడా ఉంది. అందువల్ల.. విజయవాడలో హౌస్ రెంట్ విషయంలో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదంటున్నారు. అలవెన్స్ తీసుకున్నప్పుడు కనగరాజ్ నేరుగా.. దాన్ని రెంట్ కట్టడానికి ఉపయోగించాలి. కానీ ఆయన చెన్నై వెళ్లిపోయి మళ్లీ రాలేదు. దాంతో రెంట్ కట్టడం మానేశారు. ఇప్పుడు ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కారణంగా తీసుకున్న జీత భత్యాలను కూడా వెనక్కివ్వాల్సి ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
న్యాయమూర్తిగా పని చేసి ఉన్నందున కనగరాజ్ నైతిక ప్రమాణాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆయన తక్షణం తీసుకున్న జీతభత్యాలను వెనక్కి ఇచ్చేసి… రెంట్ కడితే.. ఆయన పై నిర్వహించిన పదవిపై.. ఆయనపై గౌరవం పెరుగుతుందని అంటున్నారు. ఇంటి యజమాని కనగరాజ్‌పై కోర్టుకు వెళ్లితే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటున్నారు.