రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఇల్లు, ఇంటి స్థలం మాత్రమే కాదు. అదో పెట్టుబడి. తమకు అత్యవసరంలో పెట్టిన పెట్టుబడికి నాలుగైదింత సొమ్ము ఇస్తుందని లేకపోతే…. రిటైర్మెంట్ పెన్షన్ లాగా అద్దెలు ఇస్తుందని అందరూ అనుకుంటారు. అందుకే.. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఇల్లు కొంటే .. పదేళ్ల తర్వాత ఎంత… ఇరవై ఏళ్ల తర్వాత ఎంత ఉంటుంది.. అని లెక్కలేసుకోవడం కామన్ గా మారింది. అలా మంచి రిటర్నులు… వాల్యూ ఇచ్చే స్థలాలు, ఇళ్లకే డిమాండే పెరుగుతోంది.
సాధారణంగా ఇళ్ల ధరలు అంతా ఒకే లాగే పెరగవు. ఆయా ప్రాంత పరిస్థితుల్ని బట్టి పెరుగుతాయి. ప్రతి ఐదేళ్లకోసారి అంచనా వేస్తే.. తెలంగాణ ఏర్పడిన ఐదేళ్ల వరకూ పెద్దగా మార్పు లేదు. కానీ తర్వాత ఐదేళ్ల కాలంలోనే ధరలు మూడింతలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన సమయంలో నలభై లక్షలకు వచ్చిన విల్లాలు .. ఇళ్లు .. ఇప్పుడు కోటిన్నర పెట్టినా రావడం లేదు.అంటే పెరుగుదల ఎంత ఊహించని విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే పదేళ్లలో కాస్త ఎగుడు దిగుడులు ఉన్నప్పటికీ.. రియల్ ఎస్టేట్లో ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని రియాల్టీ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రాంతానికి అనుగుణంగా 8 నుంచి 12 శాతం ఇళ్లు, ఇంటి స్థలాల ధరలు పెరిగాయి. అంటే పదేళ్లకు ఎంతమేర పెరుగుతాయో ఊహించడం కష్టం. కానీ ఆ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందని మాత్రం అంచనా వేయవచ్చు. సంవత్సరానికి సుమారుగా 5 శాతం ధరలు పెరిగినా పదేళ్లకు 50 శాతం ఇంటి ధరలు పెరుగుతాయి. పదిహేను శాతం ్ంటే.. నూట యభై శాతం మేర పెరుగుతాయనిఅంచనా వేసుకోవచ్చు. అంటే హైదరాబాద్లో ప్రస్తుతం కోటి రూపాయలు ఉన్న ఇంటి ధర పదేళ్ల తర్వాత మూడు కోట్లు అవుతుంది.
భూముల ధరలు, నిర్మాణ వ్యయాన్ని బట్టి ధరలు మరింత పెరిగినా పెద్దగా ఆశ్చర్యం ఉండదు. సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారు ఎంత త్వరగ కొనుక్కుంటే అంత లాభం. అయితే అప్పులు చేసి.. కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆర్థిక ప్రణాళికలు వేసుకుని తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.