“జియో ఇనిస్టిట్యూట్ ” అనే యూనివర్శిటీకి… కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ.. అత్యున్నత హోదా అంటే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనిమినెన్స్ హోదా కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ హోదా పొందిన ఆరింటిలో ఒకటి రాజస్థాన్‌లో బిట్స్ పిలానీ, మణిపాల్ అకాడమీ ఆఫ్హయ్యర్ఎడ్యుకేషన్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు ఉన్నాయి. వీటికి నలభై, యాభై ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే అత్యున్నత హోదాను హెచ్ఆర్డీ మినిస్ట్రి ఇచ్చింది. మరి జియో ఇనిస్టిట్యూట్‌కు ఎందుకిచ్చారు..? అది అంత గొప్పదా అనుకున్నవారికి షాక్ తగిలే వివరాలు బయటకువచ్చాయి. ఎందుకంటే..జియో ఇనిస్టిట్యూట్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. కనీసం..శిలాఫలకం కూడా… వేయలేదు.
ప్రైవేటు రంగంలో ఇంకా ప్రారంభమే కాని విద్యాసంస్థకు … అత్యున్నత హోదా ఎలా కల్పించారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ జియో ఇనిస్టిట్యూట్ రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయాలనుకుంది. నీతూ అంబానీ.. ఈ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇది ఇంకా పేపర్లపైనే ఉంది. వచ్చే మూడు ఏళ్లలో ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనూహ్యంగా.. ఈ ఇనిస్టిట్యూట్‌కు కేంద్రం… అత్యున్నత హోదా ప్రకటించేసింది. ఇది ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో.. సమర్థించుకోలేక నానా తంటాలు పడుతోంది. గ్రీన్ ఫీల్డ్ కేటగిరిలో అత్యున్నత హోదా ఇచ్చామని చెబుతున్నారు. దీనికి కూడా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా.. జియోకు ఒక్కటంటే ఒక్క అర్హత లేదు.
మరి ఎందుకు.. జియో ఇనిస్టిట్యూట్‌కు అత్యున్నత హోదా ఇచ్చారంటే..దాని వెనుక నిధుల కారణాలే కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీకి అత్యంత సన్నిహితులైన రిలయన్స్ ఫ్యామిలీ దీన్ని ఏర్పాటు చేస్తోంది. అత్యున్నత హోదా ఇస్తే.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కోటా కింద కనీసం వెయ్యి కోట్ల నిధులు విడుదలవుతాయన్న అంచనాలున్నాయి. అందు కోసమే జియో ఇనిస్టిట్యూట్‌కు అత్యున్నత హోదా ఇచ్చారని చెబుతున్నారు. ఈ విషయం బయటకు రావడంతో.. ఎలా సమర్థించుకోవాలో కేంద్రానికి తెలియడం లేదు. ఏ కారణం చూపినా.. లేని యూనివర్శిటీకి అత్యున్నత హోదా ఇవ్వడం… అనేది విమర్శలకు అవకాశం ఇచ్చేదే. ఈ నిర్ణయంతో మోదీ ప్రభుత్వానికి మరో ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్లే..!