పవన్ కల్యాణ్ మూడ్ మొత్తం ఇప్పుడు పాలిటిక్స్ వైపు టర్న్ అయ్యింది. సినిమా ఇంటర్వ్యూల కోసం పిలిచి.. పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడిన వైనం… అందుకు తాజా సాక్ష్యం. సినిమాలంటే ఆసక్తి పోయిందని, దర్శకత్వం అంటే వికర్తి వచ్చిందని, డాన్సులంటే భయం వేస్తుందని… ఇలా రకరకాలుగా కారణాలు వెదుక్కొంటున్నాడు పవన్. సినిమాలు వదిలేయడం అంటే… ‘ఇక్కడితో ఆపేస్తా’ అని స్పష్టంగా కూడా చెప్పడం లేదు. ‘నాకు ఎప్పుడు ఆపేయాలి అని ఉంటే అప్పుడు ఆపేస్తా..’ అంటున్నాడు. అలా ఒప్పుకొన్న నిర్మాతలకే కాల్షీట్లు ఇస్తాడట. ఇది మరీ అన్యాయంగా లేదూ. సగం సినిమా తీసిన తరవాత.. `నాకు మూడ్ లేదు.. ఐ యామ్ గోయింట్ టు ద పాలిటిక్స్ `అన్నాడనుకోండి నిర్మాతలేమైపోతారు..??
అన్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పుడు తీసుకొన్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసే కార్యక్రమంలో పడినట్టు టాక్. మైత్రీ మూవీస్ తో పవన్ ఓ సినిమా చేయాల్సింది. అందుకు పవన్ కూడా ఒప్పుకొని అడ్వాన్సు తీసుకొన్నాడు. అయితే.. ఇప్పుడు ఆ ఆడ్వాన్సు తిరిగి ఇచ్చేశాడట. దాసరి నారాయణరావు అడ్వాన్సు కూడా రిటర్న్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. గతేడాదే దాసరితో పవన్ ఓ సినిమా చేయాలి. అయితే దాసరి ఇప్పటి వరకూ పవన్‌కి కథ వినిపించలేదట. అందుకే.. ఆ అడ్వాన్సు కూడా తిరిగిచ్చేద్దాం అని పవన్ ఫిక్సయ్యాడట. మొత్తానికి వపన్ నిర్ణయం నిర్మాతలకు శాపంగా మారింది. మరి అభిమానులు ఎలా తట్టుకొంటారో?