‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన సినిమా. ఇది ఆయన కెరీర్లో తొలి పీరియడ్ డ్రామా. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో వచ్చిందా లేదా అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి సినిమాలకి విజువల్ ప్రొడక్షన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. పీరియడ్ సినిమాల్లో వీఎఫ్ఎక్స్ చాలా కీలకం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయంలో విజువల్ కి ఎంతో ప్రాధాన్యత వుంది. అభిమానులు హరిహర వీరమల్లులోనూ ఆ క్యాలిటీ ఆశించడం సహజం.
అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే విజువల్ గా అబ్బురపరిచిన దృశ్యాలు పెద్దగా కనిపించలేదు. ఇలాంటి సినిమాలకి ఒరిజినల్ లుక్ రావాలంటే గ్రాండ్ సెట్స్ తో పాటు నేచురల్ గా కనిపించే లొకేషన్లను కూడా వెదికిపట్టుకోవాలి. యుద్ధ సన్నివేశాల కోసం రియల్ లొకేషన్లు ఉపయోగిస్తే సినిమా న్యాచురల్‌గా కనిపిస్తుంది. అలాగే ఓ పీరియడ్ సినిమా విజువల్ రిచ్‌గా కనిపించాలంటే కెమెరా వర్క్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పటిటి వరకూ ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన కంటెంట్ ని చూస్తే అంత విజువల్ గ్రాండియర్ కనిపించలేదు. నిన్న ఓ పాట వదిలారు. నిజానికి ఆ పాట విజువలైజేషన్ చాల బేసిక్ గ వుంది.
ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్ళింది. ఆయనకి శాతకర్ణి లాంటి పీరియడ్ సినిమా తీసిన అనుభవం వుంది. అయితే విజువల్ గా ‘హరిహర వీరమల్లు’ని ఎంత గ్రాండ్ గా తీర్చిదిద్దారో ఇంకా తెలియాల్సివుంది. ఏవో కారణాల వలన క్రిష్ తప్పుకొని జ్యోతికృష్ణ మరో దర్శకుడి గా వచ్చారు. విజువల్ గా ఆయన ఎలాంటి మార్పులు తీసుకొస్తారనేది కూడా కీలకం.
ఇప్పటివరకూ కేవలం పవన్ ఇమేజ్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసే ఆలోచనలో మేకర్స్ వున్నారని అర్ధమౌతుంది. ఇకమీద రిలీజ్ చేసే కంటెంట్ లోనైనా ‘హరిహర వీరమల్లు’ విజువల్ గ్రాండియర్ చూపిస్తే మరింత బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ వుంది.