ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ పునర్వ్యవస్ధీకరణపై దృష్టి పెట్టారన్న అభిప్రాయం.. టీఆర్ఎస్ నేతల్లో ప్రారంభమయింది. దుబ్బాక ఉపఎన్నక, గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మొత్తం ఆయా ప్రాంతాల్లోని మంత్రులదేనని.. గతంలోనే ప్రత్యేకంగా సమావేశం పెట్టి కేసీఆర్ తేల్చేశారు. ఇప్పటికి దుబ్బాక తేలింది. గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలు కావాల్సి ఉన్నాయి. అవి రెండూ అయిపోయిన తర్వాత.. కేబినెట్లో కొత్త వారిని తీసుకుని. కొంత మంది పాతవారిని సాగనంపే అవకాశాలు ఉన్నాయి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత గెలిచినప్పటి నుండి …తెలంగాణలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్నాయి.
కొన్నాళ్లుగా కొంత మంది కేబినెట్ మంత్రులపై వ్యతిరేక ప్రచారం జరిగింది. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ విషయంలో మొదట ఇలా ప్రచారం జరిగింది. ప్రస్తుతం..మంత్రి గంగుల కమలాకర్ విషయంలోనూ అదే జరుగుతోంది. వీరి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనేది టీఆర్ఎస్ అంతర్గత వర్గాల సమాచారం. కవిత ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ఆమె ఆ సాదాసీదా పదవిలో అయితే కొనసాగించే అవకాశం లేదని ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని అంటున్నారు. ఆ ప్రమోషన్ మంత్రి పదవా లేకపోతే.. మరొకటా అన్నదానిపై క్లారిటీ లేదు. కవితను కేబినెట్లోకి తీసుకుంటే.. ప్రశాంత్ రెడ్డిని ఖచ్చితంగా తప్పించాల్సి రావొచ్చు.
ఎందుకంటే… ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలోనే మంత్రిగా ఉన్నారు. ఒక వేళ కవితను కేబినెట్లోకి తీసుకుంటే… ఎర్రబెల్లి లేదా హరీష్ రావుల్లో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. సాధారణం… ఇప్పుడు హరీష్ రావు టార్గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దుబ్బాక తర్వాత బీజేపీ దూకుడు.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని కేసీఆర్ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికల తరవాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తే.. అంత కంటే పెద్ద నిర్ణయాన్నే కేసీఆర్ తీసుకోవచ్చు.