వరద బాధితుల కోసం వైసీపీ చీఫ్ జగన్ రూ.కోటి ప్రకటించారు. అయితే ఆ కోటి ఎలా ఖర్చు పెట్టాలో పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జరిగిన విపత్తుతో పోలిస్తే.. ఐదేళ్లు అధికార పార్టీగా ఉండి… వైసీపీ నేతలు దోచుకున్న సంపదతో పోలిస్తే… ఇంకా చెప్పాలంటే.. జగన్ సీఎంగా తన వ్యక్తిగత అవసరాల కోసం..ఒక్క నెలలో చేసిన ఖర్చు కంటే… చాలా తక్కువ మొత్తం ప్రకటన అది. చిన్న చిన్న కంపెనీలు కూడా బాధ్యతతో రూ. కోటి ప్రకటించేస్తున్నాయి … విరాళంగా చెక్కులు ఇచ్చిన తర్వాతే అధికారంగా చెబుతున్నాయి. కానీ జగన్ మాత్రం కోటి ప్రకటించి దాన్ని ఖర్చు చేయడానికి కమిటీ వేస్తామన్నట్లుగా మాట్లాడారు.
విజయవాడలో ఇంకా ప్రజల ఆకలి బాధతలు ఉన్నాయని… వైసీపీ నేతలు తాము ఆకలితో అలమటిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా అలాంటి బాధితులు ఉంటే తక్షణం ఆ రూ. కోటి వారి ఆకలి తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు., పార్టీ నేతల సమావేశం పెట్టి ఈ అంశంపై చర్చించి రూ. కోటి నిధులను ఆ విధంగా అయినా వడవచ్చు కదా. ఒక్క వాటల్ బాటిల్ కూడా పంపిణీ చేయడానికి ఇప్పటి వరకూ మనసెందుకు రాలేదు.
రూ. కోటిని హుదూద్ సమయంలోనూ ప్రకటించారు. కొద్ది రోజుల తరవాత ఆ కోటి పెట్టి సరుకులు కొని ప్రజలకు పంచేశామన్నారు. రేపోమాపో.. ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనే చేస్తారమో. తమ పార్టీ నాయకులు ఆల్రెడీ పంపిణీ చేశారని.. పోతిన మహేష్ లాంటి వాళ్లు పంపిణీ చేసిన పులిహోర ప్యాకెట్లను చూపించి ప్రకటించే అవకాశం ఉంది. ఎదుకంటే అది వైసీపీ మార్క్ మరి.