ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఫలితంపై ఎవరికీ డౌట్ లేదు. మేకపాటి విక్రమ్ రెడ్డే గెలుస్తారు. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి గత ఎన్నికల్లో అక్కడ వచ్చింది రెండు వేల ఓట్లు మాత్రమే. ఈ సారి కూడా అంత కంటే ఎక్కువ వస్తాయనే ఆశ లేదు. కానీ ఇతర పార్టీలు పోటీలో లేవు. ప్రభుత్వంపై.. వ్యతిరేకత ఉన్న వాళ్లందరికీ … బీజేపీనే ఆప్షన్. అందుకే.. ఇప్పుడు బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కాకుండా.. అసలు వైసీపీకి ఎన్ని ఓట్లువస్తాయన్నది కీలకంగా మారింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ పెట్టుకుని పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నేతలు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చివరి క్షణం వరకూ ఉండి ఏ మాత్రం తేడా రాకుండా కష్టపడ్డారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డబ్బులు కూడా పంచారు. దీంతో వైఎస్ఆర్సీపీ కంగారు పడుతోందన్న విషయం అర్థమైపోయింది.
వైఎస్ఆర్సీపీ లక్ష ఓట్ల మెజార్టీని పెట్టుకుంది. ఆ మెజార్టీని సాధించకపోతే విజయాన్ని వైఎస్ఆర్సీపీ పెద్దలు కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు.
అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ లక్ష ఓట్ల కంటే తగ్గితే అది ఆ పార్టీకి నైతిక పరాజయం అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే లక్ష ఓట్ల మెజార్టీ బెంచ్ మార్క్ పెట్టుకుంది వైసీపీనే. ఇప్పటికే బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అనకుున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధించలేదు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కూడా రాకపోతే.. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అనుకోవడమే. అందుకే వైసీపీకి ఆత్మకూరులో గెలుపు కాదు.. లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవడం కీలకం. లేకపోతే నైతిక ఓటమి ఖాతాలో పడిపోతుంది.