ప్రధాని నరేంద్ర మోడీ ఎంత పనిచేసినా ఆలసిపోరని ఆయన సహచరులు సహాయకులు చెబుతుంటారు. ప్రపంచ దేశాలు దేశంలో నగరాలు అలవోకగా తిరిగేస్తుంటాడాయన. ఇటీవల దావోస్లో ఆర్థిక శిఖరాగ్ర సభకు వెళ్లిన మోడీ మొదటే ప్రసంగం చేశారు. రిపబ్లిక్ దినోత్సవ కారణంగా ఒక రోజు ముందే వచ్చేశారు కూడా. ఆ రావడం రావడం క్యాబినెట్ సమావేశానికి వెళ్లిపోయారట. అక్కడ భద్రతా సలహాదారు అనిల్ దోవల్ సుదీర్ఘ నివేదిక ఇచ్చారు.దాన్ని ఆసాంతం వింటూ అనేక ప్రశ్నలు వేశారట. పైగా నివేదిక ముగిశాక తన మంత్రివర్గ సభ్యులతో ముచ్చటలాడారు. మీరంతా కొన్ని కిలోలు బరువు తగ్గి మన పార్టీ సీట్లు పెంచండి జోకులేశారట.మరుసటి రోజు రిపబ్లిక్ దినోత్సవంలోనూ ఎంతో హుషారుగా సంచరించడమే గాక ప్రోటోకోల్ కూడా పాటించకుండా కాలినడకన తిరిగారు.
ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.వయసు తక్కువే గాని ఆయనది స్థూలకాయం. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయడానికి ఆపసోపాలు పడిపోయారట. మధ్యలో అనేకసార్లు పోలీసులు మంచినీటి బాటిళ్లు సరఫరా చేయాల్సివచ్చింది. ఒక చోట ప్రసంగం కూడా చేయలేక మధ్యలో విరామం తీసుకున్నారట.