ఏడాదికి వంద కోట్లు.. ఐదేళ్లకు రూ. ఐదు వందల కోట్ల ప్రజాధనం ఒక్క ప్రకటనల రూపంలోనే సాక్షి ఖాతాకు చేరాయని అధికారికంగా వెల్లడయింది. ఇందు కోసం అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు కూడా. సాక్షి పేపర్ కొనడానికి వివిధ ప్రభుత్వ శాఖలు ఎంత ఖర్చు పెట్టాయో.. సాక్షి ఉద్యోగులకు ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చి.జీతాలు ఖాతాల్లో వేశారో అది వేరే లెక్క. ఒక్క సాక్షి మాత్రమే కాదు జగన్ కుటుంబానికి చెందిన మరో కంపెనీ భారతి సిమెంట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.
వైసీపీలో అధికారంలో ఉన్నంత కాలం భారతి సిమెంట్ ను మాత్రమే ప్రభుత్వ సంస్థలు కొన్నాయి. ఇతర సంస్థల కంటే భారత సిమెంట్ కే ఎక్కువ రేటు నిర్ణయించారు. పునాదులు కూడా వేయని ఇళ్లకు భారతి సిమెంట్ సరఫరా చేశారు. స్కూళ్లలో అరకొరగా చేసిన పనులకు భారతి సిమెంట్ నే వాడారు. అధికారులు పూర్తి స్థాయిలో భారతి సిమెంట్ నే వాడేలా చూశారు. ఈ భారతి సిమెంట్ దోపిడీ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also read : సాక్షిలో వైసీపీ యాడ్స్ – పెద్ద స్కెచ్చే !
ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు. పెడతారో లేదో తెలియదు కానీ .. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మజ్జిగ సరఫరా చేసేందుకు ఓ పది సంస్థలతో పాటు హెరిటేజ్ కూడా కొన్ని ప్యాకెట్ల సరఫరాకు కాంట్రాక్ట్ తీసుకుందని రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు చర్యలు తీసుకున్నా లేకపోయినా.. జగన్ కుటుంబానికి చెందిన సంస్థలకు.. వ్యక్తుల ఖాతాల్లోకి ఎంత ప్రజాధనం వెళ్లిందో బయటపెట్టాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం పై ఉంది.