సార్వత్రిక ఎన్నికల తొలి దశలో.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు.. ఈవీఎంల పనితీరుపై.. పెద్ద చర్చనే దేశం ముందు పెట్టాయి. మెజార్టీ స్థానాల్లో మధ్యాహ్నం వరకు.. ఎన్నికలు ప్రారంభం కాకపోవడం… దగ్గర్నుంచి… తర్వాతి రోజు ఉదయం వరకూ పోలింగ్ జరగడం… వంటి..నేరుగా ఓటర్లకు అసౌకర్యం కలిగించే వ్యవహారాలు మాత్రమే కాదు.. ఓ పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడటం, ఈవీఎంలను మధ్యలో రీప్లేస్ చేయడం లాంటి.. అనేక విన్యాసాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా సగం ఈవీఎంలు… రన్నింగ్ లో ఉండగానే.. సాంకేతిక నిపుణుల సాయంతో… ఓటింగ్ ప్రక్రియను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. చంద్రబాబు.. ఈవీఎంల సమస్యను జాతీయ స్థాయికి చేర్చారు. ఇప్పటికిప్పుడు.. ఈవీఎంలను మార్చేసి…పేపర్ బ్యాలెట్ ద్వారా.. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి.. కనీసం వీవీ ప్యాట్ స్లిప్పులు యాభై శాతం లెక్కించాలనేది… బీజేపీయేతర పార్టీల ప్రధాన డిమాండ్.
కానీ ఈసీ మాత్రం… వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ససేమిరా అంటోంది. దేశంలో అరవై శాతానికిపైగా… జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 పార్టీలు అదే పనిగా ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ఈసీ స్పందించడం లేదు. కొన్ని జాతీయ గణాంకాల సంస్థలు.. లెక్కిస్తే తప్పులేదని.. నివేదికలు ఇచ్చినప్పటికీ… ఈసీ మాత్రం.. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి … అదీ కూడా సగం లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందని అఫిడవిట్ దాఖలు చేసింది. నిజానికి.. పేపర్ బ్యాలెట్లు వాడినప్పడు.. ఎప్పుడూ.. కూడా… ఒకరోజు కన్నా.. ఎక్కువగా… కౌంటింగ్ జరిగిన దాఖలాల్లేవు. మహా అయితే.. తెల్లవారుజాము వరకు లెక్కింపు ప్రక్రియ జరిగేది. ఆ బ్యాలెట్ విధానంతో పోలిస్తే.. వీవీ ప్యాట్ స్లిప్లులు లెక్కించడం చాలా తేలిక. అయినప్పటికీ..ఈసీ ఆరు రోజులు పడుతుందంని.. సుప్రీంకోర్టుకు చెప్పింది.
ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలన్నీ… సుప్రీంకోర్టుకు మరోసారి నివేదించి… రివ్యూ పిటిషన్ వేయబోతున్నాయి. నిజానికి ఈవీఎంల పని తీరుపై.. బీజేపీ సహా.. అందరూ.. ఏదో సందర్భంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారే. అధికారంలో ఉన్నవారు మాత్రమే… వాటిని సమర్థిస్తున్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అి ఉన్నప్పుడు పుస్తకాలే ప్రచురించారు. అందుకే… ఇప్పుడు.. కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పు కౌంటింగ్ కు అయినా అంగీకరిస్తే.. అన్ని రాజకీయ పార్టీలకు… ఓ అనుమానం తీరిపోతుంది. కానీ.. ఎందుకు..ఈసీ ఈ విషయంలో మంకుపట్టు పడుతుందో మరి..!