పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నేషనల్ పాపులర్ స్టార్ అయ్యారు. తెలుగువారికి కొత్త కాదు. కానీ నార్త్ లో కొత్తే. ఆయన ఏం చేసినా.. ఆయనకు ఏం జరిగినా అక్కడో వింతలా చెప్పుకుంటారు. అరెస్టు ఘటన కూడా అంతే. అక్కడ తన ఇమేజ్ నిలుపుకోవాలనో. .. లేకపోతే తన తప్పేమి లేదని చెప్పుకోవాలన్న తపనతోనే పోలీసుల్ని ఇన్ డైరక్ట్‌గా టార్గెట్ చేసుకున్నారు అల్లు అర్జున్ అండ్ లీగల్ టీమ్. వీరి వాదనను నేషనల్ మీడియా ఎక్కువగా చూపిస్తోంది. అందుకే పోలీసులు ఇప్పుడు సీరియస్ గా తీసుకుని అసలు నిజాన్ని ప్రపంచం ముందు పెట్టాలని డిసైడయ్యారు.
ఏకపక్షంగా పోలీసులని నిందిస్తున్న నేషనల్ మీడియా
సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. కానీ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత, ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి పోలీసుల పనితీరుపై వ్యంగ్యమైన వాదనలు హైకోర్టులో వినిపించిన తర్వాత మొత్తం వారి తప్పిదమే అన్నట్లుగా హైలెట్ అయింది. కానీ అక్కడ భిన్నంగా జరిగిందని .. పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టామని చెబుతున్నారు. తర్వాత అర్జున్ కూడా అలాంటి ఆరోపణలే చేశారు. పోలీసులు ఎవరూ తన దగ్గరకు రాలేదన్నారు. అవే మాటలను నేషనల్ మీడియా వైరల్ చేసింది. తప్పు పోలీసులదేనని నిందిస్తూ ప్రసారాలు చేస్తోంది.
కమిషనర్ సీవీ ఆనంద్ కోపం అదే !
పోలీసుల తప్పు లేకపోయినా పోలీసులదే తప్పు అని నిందిస్తున్న నేషనల్ మీడియా తీరు చూసి కమిషనర్ సీవీ ఆనంద్ కూడా అసహనానికి గురయ్యారు. మిస్టర్ కూల్ గా ఆయనను పోలీసు వర్గాలు చెప్పుకుంటాయి. అలాంటిది డిపార్టుమెంట్ పై జరుగుతున్న ప్రచారంతో ఆయన కూడా అసహనానికి గురై నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని మండిపడ్డారు. పోలీసులు ఇప్పుడు తమ సిన్సియారిటీని నిరూపించుకోవడానికి అయినా అసలు సంధ్యా ధియేటర్ లో ఏం జరిగిందో మొత్తం బయట పెట్టాల్సి వచ్చింది. పెట్టారు. ఇప్పుడు సాక్ష్యాలతో సహా .. అందరి వ్యవహారాల్ని కోర్టులో పెట్టనున్నారు.
ఇప్పుడు వారి లక్ష్యం కేసులో తప్పెవరిదో కోర్టు, మీడియా, ప్రజల ముందు పెట్టడం !
తాము బయటపడటానికి వ్యూహాత్మకంగా పోలీసులపై నిందలేసి తప్పించుకుందామనుకున్నారు. కానీ తేడా కొట్టేసింది. పోలీసులు ఈ వ్యవహారంలో ఓ ప్రాణాన్ని కాపాడారు. అయినా వారిపై నిందలు పడ్డాయి. అందుకే తమ సిన్సియారిటీని ఎవరు అయితే ప్రశ్నించారో.. వాళ్లు చెప్పింది తప్పు అని.. అటు కోర్టుల్లోనే కాదు ఇటు ప్రజల ముందు.. తమను కించపరుస్తున్న నేషనల్ మీడియా ముందు కూడా పెట్టబోతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ కూడా గడ్డు పరిస్థితులు ఈ కారణంగానే ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.