‘శతమానం భవతి’ విజయం తరవాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి దర్శకుడు సతీష్ వేగేశ్న కథ చెప్పారని వచ్చిన వార్తలు నిజమే. నిర్మాత దిల్‌రాజు స్వయంగా దర్శకుణ్ణి ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకు వినిపించిన కథ మరేదో కాదు… నితిన్ హీరోగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రకథే. నితిన్ కంటే ముందు ఈ కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి నితిన్ దగ్గరకు ఎందుకు వచ్చిందంటే? ‘శ్రీనివాస కళ్యాణం’ ఫ్యామిలీ ఎమోషన్స్ వున్న కథ. మాస్ హీరో చేత చేస్తే… ఆ హీరో అభిమానుల కోసం అందులో కమర్షియల్ అంశాలను జత చేయాలి. కథ విషయంలో రాజీ పడాలి. రాజీ పడటం దిల్‌రాజుకి ఇష్టం లేక నితిన్ దగ్గరకు వెళ్లారు. నితిన్‌కి కథ నచ్చింది. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ‘శ్రీనివాస కల్యాణం’ కథ సిద్ధం చేసిన తరవాత… దిల్‌రాజు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నారు. అందులో మొదటి హీరో ఎన్టీఆర్. అతనికి కథ చెప్పారు. రెండో హీరో రామ్ చరణ్. అతనికి కథ కూడా చెప్పలేదు. చరణ్‌తో చేస్తే ఎలా వుంటుందని ఆలోచించారు. మూడో హీరో నితిన్. చివరికి అతనితో సినిమా చేశారు. ప్రతి మెతుకు మీద భగవంతుడు తినేవాళ్ల పేరు రాసి పెట్టినట్టు, సినిమాల మీద కూడా ఎవరు చేయాలో రాసి పెడతాడేమో!!