తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూయేతర ఉద్యోగులు 31 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా అధికారికంగా లెక్క తేల్చారు. వీరంతా సర్టిఫికెట్ల ప్రకారమే ఇతర మతాలకు చెందిన వారు. వీరు కోరుకుంటే ఇతర శాఖలకు పంపిస్తారు. లేకపోతే వీఆర్ఎస్ ఇస్తారు. అయితే అసలు సమస్య వీరు కాదు.. మాత మార్పిడి చేసుకున్నవారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు మొదటి నుంచి ఉన్న సమస్య డైరక్ట్ గా ఇతర మతాల కు చెందిన సర్టిఫికెట్లు ఉండి ఉద్యోగంలో చేరిన వారు కాదు. వారిని సులువుగా గుర్తించి బయటకు పంపేయగలరు. కానీ హిందువులుగా ఉంటూ మతం మారిన వారే శ్రీవారి భక్తుల మ్మును జీతంగా తీసుకుంటూ మతం మారిపోయి వేరే దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారానికి సహకరిస్తున్నారు.
2014లో వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇలా మతం మారిన వారి టీటీడీలో ఉద్యోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిచాంరు. స్వయంగా పలువురు అనుమానం ఉన్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. కొంత మంది ఇళ్లల్లో అసులు శ్రీవారి పటాలు లేకకపోవడం.. ఇతర మత ఆచారాలను పాటించడం గమనించారు. అయితే జగన్ ఆయనను తొలగించారు.
గత ఐదేళ్లలో టీటీడీలో అన్యమత ఉద్యోగులు బాగా పెరిగారు. వారందర్నీ గుర్తించేందుకు టీటీడీ ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది.