వల్లభనేని వంశీ జైలు పాలయ్యారు. పరిటాల అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రెండ్ గా టీడీపీలో ఆయనకు మంచి గౌరవం ఉండేది. ఓ సారి ఎంపీ సీటు, రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యే సీటును ఇచ్చారు. అయినా ఆయన జగన్ రెడ్డి మాయలో పడి .. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. కడుపులకు అన్నం తినేవాడెవడూ జగన్ పార్టీలో చేరడని టీవీల్లో కూర్చుని మాట్లాడిన ఆయన తర్వాత అదే పార్టీలో చేరి కడుపునకు అన్నం తినని వారు మాట్లాడే భాషను మాట్లాడారు. దాంతో ఆయన సర్వం కోల్పోయారు.
వంశీకి ఇప్పుడు ఎక్కడా చోటు జైల్లో తప్ప, వంశీ పార్టీ మారాలని అనుకున్నారో లేదో కానీ.. ఆయన వైసీపీలో చేరిన తర్వాత అడ్డగోలు విమర్శలు చేయించి ఆయనను ఎటూ కాకుండా చేసింది మాత్రం వైసీపీ, జగన్మోహన్ రెడ్డినే. ఇప్పుడు ఆయనకు కనీస సానుభూతి కూడా రావడం లేదు. చివరికి వైసీపీ లీడర్స్, క్యాడర్ లో కూడా సానుభూతి లేదు. అలాంటి వ్యక్తికి ఆ మాత్రం సరిపోదని వ్యాఖ్యానించేవారే ఎక్కువగా ఉన్నారు.
వంశీని అరెస్టు చేసిన రోజున జగన్ కూడా స్పందించలేదు. తర్వాత రోజు మధ్యాహ్నం ఓ ట్వీట్ పెట్టారు. అందులో వంశీది ఆయన తప్పు ఉందన్నారో.. లేదని చెప్పారో ఎవరికీ అర్థం కాలేదు. ఇతర సోషల్ మీడియా కార్యకర్తల సమయంలో వంటనే ట్వీట్లు పెట్టి ..వారి కుటుంబాలను పిలిపించుకుని మాట్లాడారు. కానీ వంశీని సర్వనాశనం చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్సలు చేస్తారు ఒక రోజు తర్వాత స్పందించి.. ఒక రోజు ములాఖత్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీని వలన ఆయన ఏ సందేశం పంపుతారో కానీ.. వంశీకి చేసిన నష్టాన్ని మాత్రం ఆయన భర్తీ చేయలేరని ఆయన అనుచరులు ఫీల్ అవుతున్నారు.