వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని…టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు..జాతీయ మానవ హక్కుల కమిషన్.. పల్నాడులో పర్యటిస్తోంది. పలు గ్రామాల్లో పరిస్థితుల్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. నిన్న పొనుగుపాడు అనే గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను కమిషన్ సభ్యులు పరిశీలించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో .. తమ పార్టీ సానుభూతిపరులపై దాడులు పెరిగిపోయాయని.. గ్రామాల నుంచి వందల మంది వలసలు వెళ్లిపోయారని… టీడీపీ ఆందోళనలు చేసింది. బాధితులతో శిబిరాలు నిర్వహించింది.
చలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. పోలీసులు ఎవర్నీ పల్నాడు వైపు వెళ్లనీయలేదు. అదే సమయంలో.. పల్నాడుకు చెందిన సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై.. ఆయన కుమార్తె, కుమారుడు.. రోజుకొకటి చొప్పిన నమోదు చేసిన కేసులు.. ఫర్నీచర్ కేసు వంటి వాటితో పాటు…వైసీపీ నేతల ఆరోపణలు, ఆ పార్టీకి చెందిన మీడియా చేసిన ప్రచారంతో.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే.. ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని.. టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో పోలీసులు కూడా…పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ.. ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదు మేరకు.. ఎన్హెచ్ఆర్సీ … సభ్యులు.. పల్నాడు పర్యటనకు వచ్చారు.