విశాఖ నగరానికి హెచ్ఎస్బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇలా విశాఖకు గుడ్ బై చెప్పడానికి ఆ సంస్థకు అంతర్గత కారణాలు ఉన్నా… విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపించలేదు. ఇక రాజధాని కోసం కొన్ని కంపెనీలు ఉన్న భవనాలను ఖాళీ చేశారు.
గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్స్‌ను కూడా కంపెనీలుక కేటాయించలేదు. దీంతో విశాఖకు ఐటీ లుక్ పోతోంది. మరో వైపు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఐటీ కంపెనీైలను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత అక్కడి ప్రభుత్వం వరంగల్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీలు ఉండగా.. కొత్తగా జెన్ ఫ్యాక్ట్ కూడా క్యాంపస్ ప్రారంభించేందుకు అంగీకరించింది.
ఈ విషయాన్ని జెన్ ప్యాక్ట్ సీఈవో.. మంత్రికేటీఆర్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలోనూ ఐటీ సెంటర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోనూ ప్రారంభించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటికే ఓ మాదిరి ఐటీ కేంద్రంగా ఉన్న విశాఖ వంటి చోట్ల కొత్త కంపెనీలురాకపోగా.. ఖాళీ చేసి వెళ్లిపోతున్నాయి.