రియల్ ఎస్టేట్ అభివృద్దిని అంచనా వేయడం అంత తేలిక కాదు.దానికి వరంగల్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎనిమిదేళ్లు కిందట గజం మూడు వేలు బేస్ ప్రైస్ ఉన్న స్థలం ఇవాళ 70వేలు ఉంది. వేలలో అంత కన్నా ఎక్కువగానే పలికే అవకాశాలు ఉన్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ .. వరంగల్ నడిబొడ్డున ఉన్న అజాంజాహీ మిల్లు భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి ప్లాట్లు వేసింది.
ఓ సిటీ పేరుతో ఈ కాలనీని ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్ల కిందటే ఇలా చేసింది. 117 ఎకరాల విస్తీర్ణం గల ఓ-సిటీలో కమర్షియల్, రెసిడెన్షియల్ విభాగాల్లో మొత్తం గా 905 ప్లాట్లను 12 దశల్లో విక్రయించింది. ఇప్పడు ఓ-సిటీ ప్లాట్లలో 92 శాతం నిర్మాణాలు జరిగాయి. మొదటి సారి వేలం వేసినప్పుడు బేస్ ప్రైస్‌గా రూ. మూడు వేలు నిర్ణయించారు. వాటిని వేలంలో ఏడెనిమిది వేలకు జనం దక్కించుకున్నారు. ఓ సిటీలో ఇంకా అమ్మకానికి నలభై ఐదు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి పెద్ద ప్లాట్లు. 170 నుంచి 350 గజాల వరకూ ఈ ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓ సిటీ లగ్జరీ ప్రాంతంగా మారడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కనీస ధర డెబ్బై ఐదు వేలుగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది లక్ష దాటినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
మొత్తం నలభై ఐదు ప్లాట్లను ఐదో తేదీన వేలం వేస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఇలా రియల్ వెంచర్లు వేయడంలో ప్రత్యేక సాధించింది. ఓ సిటీ చాలా పాతది. తర్వాత మా సిటీ, అని సిటీ పేరుతో రెండు వెంచర్లు వేసి అమ్మకాలు చేసింది. వరంగల్ రెండో రాజధాని అవుతుందని ప్రభుత్వం చేసే ప్రకటనలకు తోడు ఇటీవలి కాలంలో ఉపాధి అవకాశాలు పెరగడం వంటి కారణాలతో వరంగల్ లో డిమాండ్ ఇంటి స్థలాల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.