పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్లను ఓ సామాజిక బాధ్యతగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అన్నార్తులకు ఆకలి తీర్చడం అంటే దేవుడికి పూజ చేసినట్లేనోైe.ని .. మానవత్వం చూపినట్లేనని భావించే వారందరికీ అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఓ మార్గంగా మారే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రజల్ని ప్రోత్సహించనుంది. పారిశ్రామిక వేత్తలు కూడా ఇప్పటికే పలువురు స్పందించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు గత నాలుగేళ్లుగా పలు చోట్ల అన్న క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించారు. దెందులూరు, పాలకొల్లు వంటి చోట్ల నిరాటంకంగా సాగాయి. దీనికి కారణం అక్కడి టీడీపీ నేతలు ఖర్చు పెట్టుకోవడం కాదు. చాలా మంది విరాళాలు ఇచ్చారు. ప్రతీ రోజూ ఎవరో ఒకరు స్పాన్సర్ చేసేవారు. పుట్టిన రోజు లేదా తమ వారికి గుర్తుగా స్మరించుకునే రోజు.. పెళ్లి రోజు ఇలా ప్రత్యేకమైన సందర్భాలను పురస్కరించుకుని అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టించారు. పేదల కడుపు నింపారు.
ఇదే ఫార్ములాతో విరాళాలు ఇవ్వడం ద్వారా అన్న క్యాంటీన్లను నడపబోతున్నారు. ముందు ముందు అన్న క్యాంటీన్ల కోసం ప్రత్యేకమైన నిధి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరూ అన్న క్యాంటీన్లను కదిలించుకండా తిరుమల అన్నదానం ట్రస్ట్ తరహాలో.. అన్న క్యాంటీన్లకు నిధులు ఏర్పాటు చేయించి.. నిరంతరాయంగా నిర్వహించే ఏర్పాట్లను చేస్తున్నారు.