`కలర్‌ఫొటో` అనే ఓ చిన్న సినిమాలో ప్రతినాయకుడిపాత్ర చేసేశాడు సునీల్. తన వల్ల ఈ సినిమాకి కొద్దో గొప్పో క్రేజ్ వచ్చిందన్నది వాస్తవం. ఈ సినిమాకి గానూ సునీల్ అందుకున్న పారితోషికం కూడా చాలా తక్కువట. అసలు ఆ పారితోషికం లెక్కలోనికే రాదన్నది టాక్. ఈ సినిమా కోసం సునీల్ 9 రోజులు పనిచేస్తే.. 10 లక్షల పారితోషికం అందుకున్నాడట. అంటే… రోజుకి అటూ ఇటూగా లక్ష.
సునీల్ కెరీర్ ప్రారంభమై 20 ఏళ్లయ్యింది. ఏనాడూ.. జోరు తగ్గలేదు. హీరోగా మారకముందు అత్యంత బిజీగా ఉన్న కమేడియన్ , అత్యంత ఖరీదైన కమెడియన్ కూడా తనే. హీరోగా ఒక్కో సినిమాకి దాదాపు 3 కోట్ల పారితోషికం తీసుకున్న సందర్భాలున్నాయి. హీరో నుంచి… మళ్లీ కమెడియన్‌గా మారి కొన్ని సినిమాలు చేశాడు. అరవింద సమేత, డిస్కోరాజా లాంటివి. ఆయా సినిమాలకు రోజుకి 3 నుంచి 4 లక్షలు వసూలు చేసినట్టు టాక్. అలాంటి సునీల్ సడన్ గా లక్షరూపాయల పారితోషికానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సునీల్ వర్గం ఏమో.. `మావాడు పారితోషికం తగ్గించుకున్నాడు. చిన్న సినిమా కదా, దాన్ని దృష్టిలో ఉంచుకునే చేశాడు` అంటున్నారు. మిగిలినవాళ్లేమో.. `సునీల్ క్రేజ్ ఇలా తగ్గిపోయిందా` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ పారితోషికం తగ్గించుకున్నాడా, తగ్గిందా? అన్నది సునీల్ ఖాతాలో మరో కొత్త సినిమా పడేటప్పుడు తెలుస్తోంది. కాకపోతే.. ఈసినిమాపై సునీల్ చాలా ఆశలే పెట్టుకున్నాడని టాక్. ఈ సినిమాలోని తన నటన చాలా కొత్తగా ఉంటుందని, ఓ కొత్త సునీల్ ని చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాడు. అది జరిగినా… తన కష్టానికి గిట్టుబాటు `ధర` దక్కినట్టే.