తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఈ సారి రిజర్వుడు నియోజకవర్గాల్లోని కోట్లకు కోట్లు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి కనీసం ఇరవై కోట్ల పంపిణీ చేశారని.. ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో వంద కోట్ల వరకూ చెల్లింపులు చేశారన్న ప్రచారం జరుగుతోంది. చాలా కొద్ది మొత్తంలో పోలీసులు, ఎలక్షన్ స్క్వాడ్ పట్టుకున్నారు. కానీ 99 శాతం పంపకాలకు చేరిపోయిందని తెలుస్తోంది. చాలా చోట్ల పేదలు ఉండే కాలనీలతో పాటు ఈ సారి మధ్య తరగతి జీవులు ఉండే కాలనీల్లోనూ మద్యం , నగదు పంపిణీ చేశారు.
ఓటుకు వెయ్యి నుంచి 5000 వరకు పంచుతున్నారని తెలియడంతో స్థానిక ప్రజలు తమకు కూడా డబ్బులు వస్తాయని పంచే వారి దగ్గరికి వెళ్లి తమకూ ఇవ్వాలని పట్టుబడుతున్నరాు. తమకు ఓటు వేయరు అనుకున్న వారికి రాజకీయ పార్టీలు పంపిణీ చేయడం లేదు. దాంతో ప్రజలే పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి వరకు పంచుతున్నటువంటి డబ్బులను పోలీసులు వస్తున్నారని సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే పద్దెనిమిది కోట్లు పంపిణీ చేశామని అంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆడియో వెలుగులోకి వచ్చింది. లైన్ లో నిలబడి డబ్బులు ఇచ్చి దేవుడిపై ప్రమాణం చేయించుకుంటున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు ఇస్తున్నారు. ఈ జిల్లాలోని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనరల్స్థానాల్లో మొదటి విడతగా రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్జిల్లాలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టచెప్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ శాతం పెరగడానికి ఈ డబ్బుల పంపిణీ కూడా ఓ కారణంగా నిలుస్తోంది. పట్టణాల్లో ఓటింగ్ శాతం యాభై నుంచి అరవై శాతం ఉంటోంది. అదే పల్లెల్లో తొంభై శాతం ఉంటోంది.