హుజూరాబాద్ ఉపఎన్నిక సెప్టెంబర్‌లోనే అంటూ రాజకీయ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే … అన్ని పార్టీల నేతలూ అక్కడ ఇంటింట ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నేతల్ని ఆకర్షిస్తున్నారు. బీజేపీ కూడా ఇంచార్జిలను నియమించి… రంగంలోకి దూకింది. బీజేపీ దూకుడు చూసే ఇతర పార్టీల నేతలు ఉపఎన్నిక ఖాయం అనుకుని..తాము కూడా తగ్గడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ … కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉపఎన్నిక నిర్వహింప చేస్తుంది. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నుంచి సంకేతాలు ఉన్నాయని.. అందుకే వారు.. సెప్టెంబర్‌లో ఉపఎన్నికకు సిద్ధమయ్యారని అనుకుంటున్నారు.
కానీ ఇప్పుడల్లా ఉపఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని.. చెప్పి..స్వయంగా తమ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్‌తో రాజీనామా చేయించడం … అనూహ్యమైన పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడేలా ఖాళీలు ఉన్నా.. ఉపఎన్నిక నిర్వహించలేదు… ఇప్పుడు… హుజూరాబాద్ లో మాత్రం ఉపఎన్నిక ఎలా పెడతారన్న సందేహం ఇప్పుడు ప్రారంభమయింది. అసలు తీరథ్ సింగ్‌తో రాజీనామా చేయించడానికి కారణం…ఈ ఏడాదిలో అసలు ఉపఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని… ఉపఎన్నికలు ఏవైనా వచ్చే ఏడాది.. జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహింప చేస్తారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
అదే్ జరిగితే.. బెంగాల్ సీఎం కూడా తన పదవికి రాజీనామా చేయక తప్పదు. ఇలాంటి సందర్భంలో హుజూరాబాద్‌ను ప్రత్యేకంగా తీసుకుని ఉపఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. ధర్డ్ వేవ్ పై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ కారణాన్ని చూపి.. ఓ చోట ఎన్నికలు నిర్వహించి.. మరో చోట ఆపే పరిస్థితి ఉండదు. అందుకే హుజూరాబాద్‌పై రాజకీయ పార్టీలు ఎంత హడావుడి చేసినా.. ఉపఎన్నిక ఇప్పుడల్లా ఉండదనే సంకేతాన్ని.. ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో పంపారని అంటున్నారు.