పోర్టులు.. ఎయిర్ పోర్టులన్నింటినీ వదిలించుకునే క్రమంలో భారత దేశ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మెట్రో నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో తమకు ఉన్న వాటాలను విక్రయానికి పెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి. రేపోమాపో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు కూడా ఉంది. నిజానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు… ప్రైవేటు ఎయిర్ పోర్టులే. జీఎంఆర్ సంస్థ చేతిలోనే అరవై శాతానికిపైగా వాటా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి… ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అవి తెలంగాణ సర్కార్‌కు దఖలు పడి ఉంటాయి. తమకు ఉన్న వాటాలను అమ్మడానికి కేంద్రం నిర్ణయించుకుంది. తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందో ఇంకా సమాచారం రాలేదు.
అయితే ఎయిర్ పోర్టులన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ప్రక్రియలో ఇప్పటికే … కేంద్రం కొన్ని ఎయిర్ పోర్టుల్ని అమ్మేసింది. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లను దాటిసి.. ఒక్క ఏడాదిలో అత్యధిక సంపాదన పరుడిగా నిలిచిన గౌతమ్ అదానీ కీలకమైన ఎయిర్ పోర్టుల్ని ఇప్పటికే దక్కించుకున్నారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా…. జీవీకే నుంచి ఆయన కైవసం చేసుకున్నారు. అమ్మడానికి పెద్దగా ఆసక్తి చూపని జీవీకే్పై అనేకానేక సీబీఐ కేసులు నమోదయ్యాయి. అమ్మేసిన తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాటాలను ఎలాగూ అదానీనే కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే.. ఇతర కంపెనీలకు… అంత సామర్థ్యం ఉండకపోవచ్చు.
అయితే కేంద్రం వాటాలా చాలా మైనర్ వాటా. జీఎంఆర్ నుంచే.. మిగతా వాటాను… పొందాల్సి ఉంటుంది. బహుశా… జీఎంఆర్‌తో ఇప్పటికే… అదానీ గ్రూప్ లేదా.. ఆయన మధ్యవర్తులు… చర్చలు ప్రారంభించి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జీఎంఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. కాకినాడ సెజ్ ను… అరబిందో రియాల్టీకి అప్పగించేశారు. బోగాపురం ఎయిర్ పోర్టు ఉంటే చాలనుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు అమ్మకానికి పెట్టాలనుకుంటున్న ఎయిర్ పోర్టుల అంశంలో త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.