హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో గత ఐదారేళ్లుగా నడుస్తున్న ట్రెండ్ ఆకాశహర్మ్యాలు. అప్పటి వరకూ నివాసం ఉండే ఇళ్ల అపార్టుమెంట్లు ఇరవై అంతస్తులు ఉంటే చాలా గొప్పగా భావించేవారు. కానీ అప్పట్నుంచి అవి పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు అరవై అంతస్తులకు చేరాయి. ఇంకా ఇంకా భారీ ఎత్తున కట్టడానికి రెడీ అవుతున్న సంస్థల గురించి సమాచారం బయటకు వస్తోంది. అయితే ఎన్ని అంతస్తుల వరకూ కట్టడానికి అవకాశం ఉంటుందన్నది ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహం. ఎందుకంటే.. మాములు ఇండిపెండెంట్ హౌస్‌లకు జీ ప్లస్ టు పర్మిషన్ మించి రాదు. అంతకంటే ఎక్కువ రావాలంటే అది అపార్టుమెంట్ అయి ఉండాలి. ఇప్పుడు అపార్టుమెంట్లు అలా ఎదిగిపోతూ ఉన్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నిబంధన మేరకు.. ఎన్ని అంతస్తులన్న నిబంధనల లేదు. 2006లో విడుదలైన 86 జీవో ప్రకారం.. ఒక స్థలంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని కట్టే వీలును అపరిమిత ఎఫ్ఎస్ఐ కల్పిస్తుంది. కానీ కొన్ని మౌలికస సదుపాయాలుఉండాలి. ఆ స్థలం ముందున్న రోడ్డు వెడల్పును బట్టి.. ఆయా నిర్మాణానికి ఎంత ఎత్తు కట్టడానికి అనుమతిస్తారు. అధిక శాతం ఆకాశహర్మ్యాలు పశ్చిమ హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీద లేదా 100-200 అడుగుల వెడల్పు గల రోడ్ల మీదే ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఇప్పటికీ అవే నిబంధనలు అమలవుతున్నాయి. అందుకే స్క్రైస్కాపర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఎన్ని అంతస్తులు కడతారన్నదానికి ప్లాన్ తీసుకోవాల్సిందే.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు జరిగిన పలు సమావేశాల్లో ఈ స్క్రైస్క్రాపర్లకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఇంకా చాలా విస్తరించాల్సి ఉందని .. కానీ ఈ ఎత్తైన భవనాలు నిర్మించి అంతా ఒకే చోట పోగు అయితే ఎలా అని ఆయన వాదన. అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కై స్క్రాపర్లకు అనుమతులు తగ్గిపోయాయి. అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఆ నిబంధనను వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంపై చూపే ప్రభావాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక ముందు అనుమతులు భారీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఈ ఏడాది రికార్డులు బదలయ్యేలా మరింత ఎత్తైన స్కై స్క్రాపర్స్ నిర్మాణం ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.