హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దర్ని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి సోమవారం కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. అందుకే.. వీరికి ఎలాంటి శిక్షలు విధించాలన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఉరి శిక్షల అమలుపై భిన్నాభిప్రాయాలున్నాయి. 42 మందిని చంపేసిన ముష్కరులు కాబట్టి.. ఉరిశిక్ష కోరడం కూడా తప్పు లేదు. సుప్రీంకోర్టు ఏం చెబుతుంటే.. ఆ నేరానికి.. బాధితులకు మారిన వారు సంతృప్తి చెందే స్థాయిలో శిక్ష ఉండాలి. భవిష్యత్లో ఇంకొకరరు అలాంటి నేరం చేయకుండా ఉండేలా శిక్ష విధించాలి. అందుకే.. అత్యంత అరుదైన సందర్భాల్లో.. ఉరి శిక్షను విధిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఉరిశిక్షను నిషేధించారు. మరికొన్ని దేశాల్లో అమలు చేస్తున్నారు. గోకుల్ చాట్, లుంబిని పేలుళ్ల కేసు.. అత్యంత అరుదైన కేసు కిందకే వస్తుంది. నా అంచనా ప్రకారం వారిద్దరకి ఉరి శిక్ష పడుతుంది.
నేరాలు చేసిన వారికి వేగంగా శిక్షలు పడాలి..!
జంట పేలుళ్లు జరిగిన పదకొండేళ్ల తర్వాత శిక్ష ఖరారు చేస్తున్నారు. న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే.. న్యాయాన్ని నిరాకరించడమని కూడా అంటారు. పదకొండేళ్ల తర్వాత ఆ ముష్కరులకు పడే అవకాశం ఉందా..?. కింది కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్తారు. అక్కడ్నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడా కుదరకపోతే.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటారు ఇవన్నీ గడిచేసికి ఏళ్లు గడిచిపోతాయి. దాని వల్ల … ఏం ప్రయోజనం.. ?. నేరం జరిగిపోయిన తర్వాత వీలయినంత త్వరగా.. శిక్ష పడితేనే.. బాధితులకు కాస్తంత సాంత్వల లభిస్తుంది. మనం రోజూ ఎన్నో సంచనలనాత్మకమైన కేసులను పేపర్లలో చూస్తూంటాం. కానీ ఆ కేసులన్నీ ఏమవుతున్నాయో.. ఎవరికీ తెలియదు. నిందితులకు శిక్ష పడుతుందో లేదో తెలియడం లేదు. ఆ శిక్ష తీవ్రత మాత్రమే.. నిరోధక శిక్ష కాదు.. ఎంత వేగంగా..శిక్ష వేశారో అన్నది కూడా కీలకమే.
టెర్రరిస్టులకు ఉరిశిక్షపై భిన్నాభిప్రాయాలు..?
ఇప్పటి వరకూ మన దేశంలో ఒకటి, రెండేళ్లలో తేలిపోయిన ఒక్కటి కూడా లేదు. ఒక్క టెర్రరిస్టు దాడుల కేసు.. విచారణ పూర్తి చేయడానికి పదకొండు ఏళ్లు పడితే.. ఇంకో పది పదిహేనేళ్లు సాగితే.. ఏంటీ దీనికి పరిష్కారం..? కొంత మంది.. ఈ ప్రాసెసే పనిష్మెంట్ అంటూ ఉంటారు. వేగంగా న్యాయం జరగాలి అంటే.. అది నేరం చేసేవారిని భయపెట్టేలా ఉండాలంటే.. ఎంత త్వరగా శిక్ష విధించాలనేది పరిశీలించారు. ఉరి శిక్ష విధించేసరికి.. అనేక వాదనలు వినిపిస్తున్నాయి. 42 మంది చనిపోవడానికి కారణం అయినందున.. కచ్చితంగా.. ఉరిశిక్ష విధించాలని కొంత మంది ఉంటారు. చనిపోయిన వాళ్లు సరే.. ఆ బాంబుదాడుల్లో వికలాంగులుగా మారి నరకం అనుభవిస్తున్న వారిలా.. జీవితాంతం నరకం అనుభవించాలని కొంత మంది అంటారు. ఉరిశిక్ష విధిస్తే.. ఒక్క క్షణంలో ప్రాణం పోతాడు. కానీ జీవితాంతం కఠిన కారాగారశిక్ష విధిస్తే.. జీవితాంతం నరకం అనుభవిస్తారని చెబుతూంటారు. అలాగే.. ఇలాంటి వారు అలా జీవితాంతం.. శిక్ష అనుభవిస్తూ… ఎప్పుడైనా ఏదో ఓ కారణంతో విడుదలవడమో.. తప్పించుకోడమో చేస్తే.. అలాంటి వారు… సమాజానికి తీవ్ర హానికరం. అలాగే.. ఇలాంటి ముష్కరులను ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు పోషించాలనేది మరో వాదన..! ప్రజల డబ్బులతో ఇలాంటి నేరస్తులను మనం ఎందుకు పోషించాలి.. అనే ఉంది.
ఉరిశిక్ష విధించడానికి అనేక అడ్డంకులు..!
ఉరిశిక్ష అమలు చేయాలా వద్దా అన్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఉరిశిక్ష విధిస్తే.. న్యాయం జరుగుతుందా..? అని కొంత మంది చర్చిస్తూ ఉంటారు. అయితే.. 42 మంది ప్రాణాలు కోల్పోవడానికి.. పదుల సంఖ్యలో బంగారు భవిష్యత్ ఉన్న అనేక మంది మంచాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే వీరికి…అత్యంత కఠినమైన శిక్ష పడాల్సిందే. అది ఉరిశిక్ష అంటేనే సమంజసమైనది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు ఇది. మన చట్టంలో రాజ్యాంగంలో ఉరిశిక్ష విధించాడనికి.. అమలు చేయడానికి ఓ ప్రాసెస్ ఉంది. అది ఎందకు పెట్టారంటే… అది వెనక్కి తీసుకోలేని శిక్ష. ఓ సారి ఉరి వేస్తే.. శిక్షను వెనక్కి లాగలేవు. శిక్ష తీవ్రత పెరుగుతున్నకొద్దీ.. శిక్ష విధించడానికి తీసుకునే సమయం పెరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే.. ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. మన దేశంలో పంటికి పన్ను.. కంటికి కన్ను అనే శిక్షలు లేవు కనుక… ఉరి శిక్షలపై చర్చల జరుగుతోంది. సహజంగా అయితే.. దోషులు తేలిగాన వారికి ఉరి శిక్ష పడాల్సిందే.
టెర్రరిజానికి కులం, మతం లేదు..!
తీవ్రవాదులు.. ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడి.. టెర్రరిజం కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తీవ్రవాదులు ఉరి శిక్ష పడితే.. వారిలో మార్పు వస్తుందా..? రాకపోవచ్చు. కానీ దుర్మార్గానికి తీవ్రవాదులను ఎలాంటి శిక్ష విధించాలన్న చర్చ వేరు. తీవ్రవాదం ఎలా తగ్గించాలన్న చర్చ వేరు. ఈ రెండింటిని కలిపి చూడకూడదు. తీవ్రవాదాన్ని తగ్గించలేకపోతున్నాం కాబట్టి.. తీవ్రవాదులను శిక్షించడం లేదని వాదించడం కరెక్ట్ కాదు. కటినమైన శిక్షలు ఉండాల్సిందే. బాంబు దాడుల్లోచనిపోయిన, గాయపడిన వరారీలో అనేక మంది ముస్లింలు ఉన్నారు. అంటే..తీవ్రవాదానికి కులం, మతం లేదు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి..!
ఈ విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ఇంటలిజెన్స్ ను పటిష్టం చేసుకోవాలి. టెర్రరిస్టులకు స్లీపర్ సెల్స్ ఉన్నారు. టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చే ఈ పని చేయడం లేదు. ఇక్కడున్న వారితో ఆ పనులు చేయిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఇంటలిజెన్స్ ను పటిష్టం చేసుకోవాలి. అలాగే.. లోకల్ గా ఉన్న వారిని ఎదురు ప్రేరేపిస్తున్నారు.. లాంటి కనుక్కుని.. తీవ్రవాదాన్ని ముగింపు పలకాలి. భారతదేశం తీవ్రవాదులకు ఎప్పటికీ సాఫ్ట్ టార్గెట్ కాకూడదు. దానికి తగ్గట్లుగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో.. ఏం జరిగినా.. ప్రభుత్వం ఏం చేయడం లేదు. అదే సమయంలో… ప్రతీ దానికి నిరసన వ్యక్తం చేసేవారిని అరెస్ట్ చేయడం కాదు. నిరసనలు వేరు. తీవ్రవాదం వేరు. దేశ సార్వభౌమాత్వాన్ని ప్రశ్నించేవారిని వదిలి పెట్టకూడదు. అదే సమయంలో.. తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడేవారికి ఖఠిన శిక్షలు పడేలా చేయాలి.