హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే ఎక్కడ బెటర్ అంటే.. చాలా మంది ఐటీ కారిడార్ వైపు చూపిస్తారు. కానీ ఏ సిటీలో అయినా ఇలా ఒక వైపే డిమాండ్ ఉన్నా.. అక్కడే నివాస, ఉాపాధి అవకాశాలు పోగుపడినా అతి సమతుల్యతను దెబ్బతీస్తుంది. హైదారాబాద్‌కు ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రచారం ప్రకారం.. ఐటీ కారిడార్.. కోకాపేటల వైపు జనం చూస్తున్నారని అనుకుంటున్నా… మరో వైపు కూడా బాగా అభివృద్ది చెందుతోంది.
ఇన్ఫోసిస్ అతి పెద్ద క్యాంపస్ ఎక్కడ ఉంది. ఐటీ కారిడార్ లో మాత్రం లేదు. పోచారంలో ఉంది. ఈ పోచారం హైదరాబాద్ ఈస్ట్ లో ఉంటుంది. ఇన్ఫోసిన్ మాత్రమే కాదు.. పలు కంపెనీలు అక్కడ ఏర్పాటవుతున్నాయి. అలాగే తయారీ రంగానికీ కీలకంగా ఉంటోంది. ఫలితంగా హైదరాబాద్ ఈస్ట్ కూడా హాట్ కేక్‌గా మారుతోంది.
హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతాలుగా ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, హయత్ నగర్, పోచారం వంటి ఏరియాలను చెప్పవచ్చు. ఈ ఏరియాలో గతంలో మౌలిక సదుపాయాలు పెద్దగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ప్రజా జీవనం సులువుగా సాగిపోయేలా అభివృద్ధి చెందింది. ఈస్ట్ జోన్లో ఇప్పటికే నాగోల్, ఎల్బి నగర్ వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంది. ఉప్పల్ సమీపంలో భగాయత్ లే అవుట్, మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలు భారీగా నిర్మాణంలో ఉన్నాయి. ఎస్ఆర్డిపిలో భాగంగా నిర్మించిన ఫ్లైఓటర్ల కారణంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. మెట్రో విస్తరణ ఇప్పుడు ఈస్ట్‌కు బూస్ట్ ఇవ్వబోతుంది.
Read Also :మేడ్చల్ వైపు శరవేగంగా మహానగరం విస్తరణ !
ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండిఏ డెవలప్ చేసిన ప్రాంతంలో జరుగుతున్న రియల్ డెవలప్మెంట్ ఈస్ట్ జోన్లో స్థిరాస్తికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వెస్ట్ జోన్‌తో పోల్చినప్పుడు తక్కువ ధరకు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసేకుందుకు అవకాశం ఉంది. ప్రభుత్వంకూడా లుక్ ఈస్ట్ అనే పాలసీ తీసుకు వచ్చింది. భూములు కూడా అందుబాటులో ఉండటంతో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చేలా ప్రయత్నిస్తోంది. వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
లాంగ్ రన్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఈస్ట్ లో ఇల్లు కొంటే మంచి ఫలితం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.